Begin typing your search above and press return to search.
నల్లగొండ ఉప ఎన్నికకు కేసీఆర్ మార్క్ ట్విస్ట్
By: Tupaki Desk | 28 Sep 2017 5:49 PM GMTటీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ చాణక్యం వల్ల ``ప్రతిపాదిత నల్లగొండ ఉప ఎన్నిక`` రాజకీయం వేడెక్కుతోంది. కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచి టీఆర్ ఎస్ లో చేరిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో గులాబీ దళపతి కేసీఆర్ రాజీనామా చేయించనున్నారనే వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేసీఆర్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేశారని సమాచారం వస్తోంది. దసరా తర్వాత ఉప ఎన్నికపై క్లారిటీ వస్తుందని ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజాగా తన సన్నిహితులతో టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికరమైన విషయం ఒకటి పంచుకున్నట్లు సమాచారం.
టీఆర్ ఎస్ లోని విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం నల్లగొండ ఉప ఎన్నిక విషయంలో సీఎం కేసీఆర్ వేచిచూసే దోరణలో ఉన్నారు. కారణం ఒకింత ఆసక్తికరమే. ప్రస్తుతం తెలంగాణలో కీలకమైన సింగరేణి కార్మికుల గుర్తింపు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు టీఆర్ ఎస్ పార్టీకి కీలకమైనవి. టీఆర్ ఎస్ కు గత ఎన్నికల్లో భారీగా సీట్లు - ఓట్లు ఇచ్చిన ఈ కార్మికుల ఇలాకాలో కాస్త ఎదురుగాలి వీస్తున్నట్లు కేసీఆర్ కు సమాచారం వచ్చిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో అనుకూలత ఉన్నచోటనే ఇప్పుడు ఎదురుగాలి వీస్తున్నప్పుడు పార్టీ పూర్తిస్థాయిలో బలంగా లేని నల్లగొండ నియోజకవర్గంలో ప్రయోగం చేయడం సరికాదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. సింగరేణి ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకొని నల్లగొండ ఉప ఎన్నికపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
కాగా, నల్లగొండ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పరోక్షంగా సీఎం కేసీఆర్ తన ప్రణాళికలు అమల్లో పెట్టిన సంగతి తెలిసిందే. నల్లగొండ ప్రజల ప్రధాన డిమాండ్లు తీర్చడంతో పాటు ఏ వర్గంలో మద్దతు ఉంది, ఏ వర్గంలో అసంతృప్తి ఉంది వంటి వివరాలను సామాజిక వర్గాలు వృత్తుల ఆధారంగా సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా సర్వేల ప్రకారం నల్లగొండ పార్లమెంట్ ప్రజలు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతుండగా, ఈ శాతాన్ని మరింతగా పెంచుకునేందుకు నల్లగొండ ప్రజల కోర్కెలు తీర్చేందుకు అభివృద్ధి జాతరకు సీఎం శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో నల్లగొండలో సీఎం పర్యటన సందర్భంగా రూ.500కోట్ల పనులకు శంఖుస్థాపనలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఐటీ పార్క్, 10వేల డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు శిల్పారామం, కళాభారతి వంటి పనులను మంజూరు చేస్తూ త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం.