Begin typing your search above and press return to search.
కొత్త జిల్లాలపై కేసీఆర్ కన్ఫ్యూజన్?
By: Tupaki Desk | 11 Jun 2016 5:22 AM GMTతెలంగాణలో ప్రస్తుతం ఉన్న 10 జిల్లాల్ని పాతిక జిల్లాలు చేయాలని.. కాదు 30 జిల్లాలు చేయాలన్న అంచనాలకు తోడుగా తాజాగా మరో అంచనా తెర మీదకు వచ్చింది. దీని ప్రకారం తెలంగాణలో అయితే 24 జిల్లాలు లేదంటే 26 జిల్లాల్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో తెలంగాణ సర్కారు ఉందన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా జిల్లాల ఏర్పాటుపై ఎవరి దాకానో ఎందుకు సాక్ష్యాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా స్పష్టత లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. తొలుత అనుకున్న దానికి.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందని చెబుతున్నారు.
వాస్తవానికి కేసీఆర్ మొదటి నుంచి కొత్త జిల్లాల గురించి స్పష్టంగా ఏ మాట చెప్పలేదన్నది మర్చిపోకూడదు. కొత్త జిల్లాలు ఏర్పాటుపై ఆయన చెప్పినంత బలంగా.. ఎన్ని కొత్త జిల్లాలు రానున్నాయన్న విషయం మీద మాత్రం ఆయన నోటి నుంచి ఎప్పుడూ ఒక అంకె రాలేదన్న విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడున్న 10 జిల్లాలకు అదనంగా 14.. 15 జిల్లాల్ని ఏర్పాటు చేయాలన్న మాటే కేసీఆర్ పదే పదే చెప్పారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై అందరూ అనుకుంటున్న దానికి భిన్నంగా ఏర్పాటు ఉందన్న మాట వినిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఆదునిక సాంకేతిక నైపుణ్యం.. టెక్నాలజీని వినియోగించుకుంటున్న కేసీఆర్ అండ్ కో.. గూగుల్ మ్యాప్ ల మీదనే ఆయన ఎక్కువగా ఆధారపడినట్లుగా తెలుస్తోంది. కొత్త జిల్లాల కసరత్తుకు సంబంధించి గూగుల్ మ్యాప్ లను ముందు వేసుకొని కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఈ మధ్యన ఇరిగేషన్ ప్రాజెక్టులపై గూగుల్ మ్యాప్ లతో అసెంబ్లీలో ప్రజంటేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి.. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలోనూ అదే విధానాన్ని అనుసరిస్తున్నట్లుగా చెబుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఎలా ఉండాలి? వాటి సరిహద్దులు ఏమిటి? ఎలా ఉంటే ఇబ్బందులు ఉండవన్న కోణంతో పాటు.. ఏ విధంగా కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తే ‘రాజకీయం’గా ప్రయోజనం చేకూరుతుందన్న విషయంపై కూడా ముఖ్యమంత్రి దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా ఆందోళనలు చోటు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న ఆయన.. జిల్లాల మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. కొత్త జిల్లాల సరిహద్దుల విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నట్లు చెబుతున్నారు. కొత్త జిల్లాల కసరత్తు మొత్తంలో గూగుల్ కీలకంగా మారిందన్న మాట చెబుతున్నారు. అంతేకాదు.. కొత్త జల్లాలకు సంబంధించి ఒకటికి రెండు వేర్వేరు సరిహద్దులతో ముసాయిదాల్ని రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నారు. తుది ఎంపిక సమయంలో వచ్చే ఇబ్బందుల్ని అధిగమించేలా ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొత్త జిల్లాలకు సంబంధించి చాలానే జిల్లాలకు ఒకటికి రెండు.. కొన్ని జిల్లాల విషయంలో మూడు వేర్వేరు సరిహద్దులతో జిల్లాల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనికి గూగుల్ మ్యాపులు ఎంతో సాయం చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్ కొత్త జిల్లాలకు గూగుల్ కీలకంగా మారిందన్న మాట.