Begin typing your search above and press return to search.
సదరన్ స్పేస్ : కేసీఆర్ కొత్త పార్టీకి పాత ఫార్ములా !
By: Tupaki Desk | 15 Jun 2022 11:30 PM GMTత్వరలో జాతీయ స్థాయిలో పార్టీ ప్రారంభించాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగానే రాజకీయం కూడా ఆరంభించారు. భారతీయ రాష్ట్ర సమితి పేరిట కానీ భారత్ రాష్ట్ర సమితి పేరిట కానీ ఓ పార్టీ పెట్టాలని యోచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను కూడా ఈ నెల 18 న కానీ 19 న కానీ ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే జాతీయ స్థాయిలో పార్టీ పెడితే కేసీఆర్ వ్యూహం ఎలా ఉంటుందన్న విషయమై చర్చ నడుస్తోంది.
ప్రాంతీయ వాదం వినిపించి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసిన కేసీఆర్ అదేవిధంగా తన వాదాన్ని జాతీయ స్థాయిలోనూ వినిపించేందుకు చూస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో పట్టు పెంచుకుంటూ, ప్రాంతీయ అసమానతల్లో దేశం ఏ విధంగా నలిగిపోతుంది అన్నది వివరించేందుకు సమాయత్తం అవుతున్నారు.
ముఖ్యంగా నిధుల పరంగా దక్షిణాది రాష్ట్రాలకు ఇవాళ తక్కువ ప్రాధాన్యమే దక్కుతోంది. అదేవిధంగా జలవివాదాలూ ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు కేంద్రం చొరవ చూపడం లేదు అన్న వాదన కూడా ఉంది. పన్నుల చెల్లింపుల రూపంలో దేశంలోనే ఎక్కువగా తెలంగాణ కంట్రీబ్యూషన్ ఉన్నా కూడా అందుకు అనుగుణంగా నిధుల విడుదల లేదన్నది కేసీఆర్ వాదన.
ఈ తరుణంలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధే తన డిమాండ్ గా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా దక్షిణాది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసేందుకు సిద్ధం అవుతున్నారు.
బీజేపీ యేతర, కాంగ్రెస్సేతర కూటమి ఏర్పాటుకు మొదట్లో సన్నాహాలు చేసిన కేసీఆర్ తరువాత మాత్రం తన పంథాను కాస్త మార్చి జాతీయ వాదం వినిపిస్తూనే ప్రాంతీయంగా తమకు ఉన్న సమస్యలు వాటి పరిష్కారాల విషయమై ఆ రెండు పార్టీలు (బీజేపీ, కాంగ్రెస్) అవలంబిస్తున్న విధానాలు వీటన్నింటినీ కూడా వివరిస్తూ ముందుకు వెళ్లనున్నారు. కేరళ, తమిళనాడుతో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలలో బలపడేందుకు సంబంధిత స్థానిక పార్టీల మద్దతుతో ఆయన పనిచేయనున్నారు.
గతంలో వినిపించిన విధంగానే ప్రాంతీయ వాదం వినిపిస్తూ, దేశ ఐక్యతకు, సమగ్రతకూ తాను ఏవిధంగా మత సంబంధ రాజకీయాలకు దూరంగా ఉంటానో అన్నది కూడా వివరించి పార్టీని ముందుకు నడిపించనున్నారు.