Begin typing your search above and press return to search.
పంటితో తీయటం తర్వాత..కడుపు మీద కొట్టారే?
By: Tupaki Desk | 9 Oct 2019 6:57 AM GMTమనసుకు తోచినట్లుగా చెప్పేసే రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. ఇప్పుడు నడుస్తున్నదంతా డిజిటల్ యుగం. సామాన్యుడు కావొచ్చు సీఎం కావొచ్చు.. వారి నోటి నుంచి ప్రతి మాటా రికార్డు అయిపోతున్న రోజులివి. మీడియా అమ్మ మొగుడుగా మారిన సోషల్ మీడియా వచ్చేసిన వేళ.. దేన్ని ఎవరూ ఎప్పటికి దాచలేని పరిస్థితి. తాజాగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు.. చెబుతున్న మాటలపై సటైర్లు మామూలుగా పేలటం లేదు.
ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా నెగిటివ్ గా అనకుండా వీడియోలు కట్ చేసి సోషల్ మీడియాలో అదే పనిగా పోస్టు కావటమే కాదు.. అంతకంతకూ వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ వేళలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మాట్లాడిన కేసీఆర్ మాటలు ఇప్పుడు చిట్టి వీడియోల రూపంలో జనాల సెల్ ఫోన్ స్క్రీన్ల మీద మస్తుగా దర్శనమిస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని తీర్చాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్ మాటను ఇప్పుడు అదే పనిగా వినిపిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తన పంటితో తీస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ మాటల వీడియోను షేర్ చేయటం ద్వారా.. పవర్ లేనప్పుడు.. చేతికి వచ్చినప్పుడు సారు మాటలో వచ్చిన తేడాను గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కేసీఆర్ నిర్ణయాలు ఎప్పుడెలా మారిపోతాయనటానికి తాజా వీడియో చక్కటి ఉదాహరణగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న సీఎం మాటలకు భిన్నంగా.. ఈ తరహా వీడియోలు వైరల్ అవుతున్న తీరు చూస్తే.. సారు ఇమేజ్ కు మస్తు డ్యామేజీ జరిగే ప్రమాదం పొంచి ఉందన్న మాట వినిపిస్తోంది. మరీ.. విషయం పవర్ గ్రిడ్ చేతిలో ఉన్న కేసీఆర్ సారుకు ఎలా చేరుతుందో?