Begin typing your search above and press return to search.
కేసీఆర్ నోట.. అపార్ట్ మెంట్లకు నల్లా నీళ్ల క్లారిటీ ఎందుకు వచ్చింది?
By: Tupaki Desk | 29 Nov 2020 10:10 AM GMTగ్రేటర్ ఎన్నికల వేళ.. ఎల్ బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆసక్తికరంగానే కాదు.. కొన్ని వర్గాల వారికి సంతోషాన్ని కలిగించాయి. అందులో ఒకటి.. అపార్ట్ మెంట్ వాసులకు.. ఒక్కో ఫ్లాట్ కు 20వేల లీటర్ల నీటిని ఉచితంగా అందించటం. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్.. నల్లా కనెక్షన్ కు నెలకు 20వేల లీటర్లు చొప్పున ఉచితంగా అందిస్తామని.. తాను చెప్పిన అంశంపై కొన్ని సందేహాలు నెలకొన్నాయని.. వాటిని తాను తీర్చాలనుకుంటున్నట్లు చెప్పారు.
తన నెంబరును సంపాదించి మరీ.. తనకు ఫోన్ చేసి కొందరు మాట్లాడినట్లుగా కేసీఆర్ చెప్పారు. నిజంగానే సీఎం కేసీఆర్ ఫోన్ నెంబరును అతి కష్టమ్మీదా దొరకబట్టినప్పటికి ఆయనకు ఫోన్ చేస్తే.. వెంటనే ఎత్తుతారా? అసలు సీఎంకు ఫోన్ చేసినప్పుడు ఎత్తేదెవరు? కాల్ అటెండ్ చేసి.. ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకొని సీఎంకు ఇచ్చేందుకు ప్రత్యేకంగా మనుషులుగా ఉంటారన్నది తెలిసిందే. అలాంటిది.. సీఎంతో నేరుగా మాట్లాడే అవకాశం సామాన్యులకు ఉంటుందా? అంటే సందేహమే.
కొద్ది రోజులవ్యవధిలోనే టీఆర్ఎస్ పార్టీ మీడియా సంస్థకు వస్తున్న ఫోన్ కాల్స్ అధినాయకత్వానికి వెళ్లటం.. సన్నిహితులతో చర్చించిన మీదట.. ఆ విషయాన్ని కాస్త మార్చి.. కేసీఆర్ తన దైన శైలిలో ప్రస్తావించారని చెప్పాలి. మొత్తానికి కేసీఆర్ ఫోన్ నెంబరు తెలీకున్నా.. ఆయన సొంత మీడియా సంస్థకు అదే పనిగా ఫోన్లు చేయటం ద్వారా.. కొన్ని సమస్యల్ని నేరుగా సీఎం వరకు వెళ్లే వీలుందన్న మాట వినిపిస్తోంది.
తన నెంబరును సంపాదించి మరీ.. తనకు ఫోన్ చేసి కొందరు మాట్లాడినట్లుగా కేసీఆర్ చెప్పారు. నిజంగానే సీఎం కేసీఆర్ ఫోన్ నెంబరును అతి కష్టమ్మీదా దొరకబట్టినప్పటికి ఆయనకు ఫోన్ చేస్తే.. వెంటనే ఎత్తుతారా? అసలు సీఎంకు ఫోన్ చేసినప్పుడు ఎత్తేదెవరు? కాల్ అటెండ్ చేసి.. ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకొని సీఎంకు ఇచ్చేందుకు ప్రత్యేకంగా మనుషులుగా ఉంటారన్నది తెలిసిందే. అలాంటిది.. సీఎంతో నేరుగా మాట్లాడే అవకాశం సామాన్యులకు ఉంటుందా? అంటే సందేహమే.
మరి..ముఖ్యమంత్రి నోటినుంచి వచ్చిన మాట మర్మమేమిటి? అన్న విషయంపై లోతుగా ఆరా తీస్తే ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. ప్రతి నల్లా కనెక్షన్ కు 20వేల లీటర్లు ఫ్రీ అన్న మాటను ప్రకటించిన తర్వాత.. సీఎం సొంత మీడియా సంస్థకు అదే పనిగా ఫోన్లు రావటం.. అపార్ట్ మెంట్ విషయంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో వేలాది అపార్ట్ మెంట్లు ఉంటాయని.. అందులో పది ప్లాట్ల నుంచి ఒకే కనెక్షన్ మీద 200 ప్లాట్లు కూడా ఉంటాయని.. అలాంటి వేళలో ప్రభుత్వం చెప్పినట్లుగా ఉచిత నీళ్ల వాటా చాలా.. చాలా తక్కువగా ఉంటుందని వాపోయినట్లుగా తెలుస్తోంది.