Begin typing your search above and press return to search.
రైతుల ఫ్యామిలీల కంటే..అల్లం పంటే ముఖ్యమా?
By: Tupaki Desk | 10 Oct 2015 5:39 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విలక్షణత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకు నచ్చిన ఏపనిని అయినా ఎలాంటి మొహమాటం లేకుండా చేస్తారు. ఎవరో ఏదో అనుకుంటారని ఆయన అస్సలు పట్టించుకోరు. తెలంగాణ రాష్ట్రంలో నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. తెలంగాణ సర్కారు కానీ.. తెలంగాణ అధికారపక్షం తరఫున ఎవరూ ఎలాంటి పరామర్శను చేస్తున్న దాఖలాలు కనిపించవు.
మొన్న ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. రైతుల కష్టాల్ని తాము తీరుస్తామని.. వారికి తాము అండగా నిలుస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసం ఏదైనా చేస్తారని.. కొత్త పథకాన్ని ప్రకటిస్తారేమోనని పలువురు భావించినా.. అలాంటిదేమీ చోటు చేసుకోలేదు.
ఆత్మహత్య చేసుకున్నకుటుంబాలు నిరాశతో.. పుట్టెడు దుంఖంతో కూరుకుపోయి ఉంటే.. వారిలో స్థైర్యం నింపటానికి పెద్దగా చేసిందేమీ లేదన్న విమర్శ వినిపిస్తోంది. రైతుల విషయంలో ఇంత ఉదాసీనంగా ఉన్న ముఖ్యమంత్రి.. ఒక రైతుగా మాత్రం ఆయన ప్రదర్శించే జాగ్రత్తల్ని తెలంగాణలోని సగటు రైతు అనుసరించాల్సి ఉంది. ఎందుకంటే.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్.. తనకు ఏమాత్రం వీలు చిక్కినా ఒక రైతుగా తాను వేసిన పంట గురించి ఆరా తీయటం..వాటిని ప్రత్యక్షంగా పరిశీలించటం చూసినప్పుడు.. ఆయనలోని రైతు స్పష్టంగా కనిపిస్తారు.
రాష్ట్ర పాలకుడిగా కంటే కూడా రైతు పాత్రలోనే కేసీఆర్ ఎక్కువ న్యాయం చేస్తారన్న విమర్శ వినిపిస్తోంది. నిత్యం రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వారికి సంబంధించి.. అలాంటి దురదృష్ట ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా చర్యలపై పెద్దగా దృష్టి పెట్టని ఆయన.. ఈ మధ్య కురిసిన వర్షాల కారణంగా.. తన ఫాంహౌస్ లో పల్లపు ప్రాంతంలో నిలిచిన నీరు కారణంగా దెబ్బ తిన్న అల్లం పంటను పరిశీలించేందుకు ప్రాధాన్యత ఇవ్వటం కాస్తంత ఆశ్చర్యకరమే. శుక్రవారం ఫాంహౌస్ కు వెళ్లిన ఆయన.. శని..ఆదివారాలు కూడా ఫాంహౌస్ లోనే ఉంటారని చెబుతున్నారు. చూస్తుంటే.. రాష్ట్రంలో రైతుల ఈతి బాధల కంటే కూడా అల్లం పంట మీద కేసీఆర్ కు ఎక్కువ దిగులు ఉన్నట్లు కనిపిస్తుందన్న విమర్శ వినిపిస్తోంది.