Begin typing your search above and press return to search.
ఆంధ్రజ్యోతి ఆఫీసులో కేసీఆర్!
By: Tupaki Desk | 2 May 2017 9:37 AM GMTకొన్ని విషయాల్లో అత్యంత వేగంగా రియాక్ట్ అయ్యే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరికొన్ని విషయాల్లో మాత్రం ఆయన అందుకు భిన్నంగా వ్యవహరిస్తారని పేరుంది. తనకు నచ్చితే ఎక్కడికైనా వెళ్లే.. ఆయన తనకు నచ్చని వారి విషయంలో.. ఎంత ముఖ్యమైన కార్యక్రమమైనా హాజరు కారన్న వాదనను వినిపిస్తుంటారు. ఎంత ప్రముఖుడైనా.. ఎంత కీలకమైన అంశమైనా జస్ట్ ఇగ్మోర్ అన్నట్లుగా ఆయన వైఖరి ఉంటుందని చెబుతుంటారు.
ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఆయన జూబ్లీహిల్స్ లోని ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. గత శనివారం ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం అగ్నిప్రమాదానికి గురై.. పూర్తిగా దగ్థమైన సంగతి తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ కారణంగా భవనంలో మంటలు చెలరేగటం.. పేపర్లు ఎక్కవగా ఉండటంతో వెనువెంటనే రెండు అంతస్తుల్లోకి మంటలు వేగంగా వ్యాపించాయి.
అగ్ని ప్రమాదం జరిగిన నలభై నిమిషాలకు చిన్న ఫైరింజన్ ఒకటి రావటం.. మంటలు అదుపు చేయలేకపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఒక ప్రముఖ మీడియా సంస్థలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితేనే వ్యవస్థలు ఇంత నిదానంగా స్పందిస్తే... సామాన్యుల సంగతేమిటన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కారు దిగిన వెంటనే.. బిల్డింగ్‌ను అసాంతం చూస్తూ.. దగ్థమైన భవనాన్ని చూస్తుండిపోయారు. అనంతరం.. రెండు ఫ్లోర్లను స్వయంగా పరిశీలించి.. ప్రమాదం వివరాల్ని. . జరిగిన నష్టాన్ని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణమూర్తిని అడిగి తెలుసుకున్నారు. కాసేపు ఆంధ్రజ్యోతి కార్యాలయంలో గడిపిన ఆయన.. ఆ తర్వాత వెళ్లిపోయారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి జ్యోతి ఆఫీసుకు రావటం.. పరామర్శించటం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో.. జ్యోతికి సన్నిహితంగా ఉంటారన్న పేరున్న చంద్రబాబు.. ఇప్పటివరకూ పరామర్శకు రాకపోవటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/