Begin typing your search above and press return to search.

ఆహా ! : కొత్త స‌చివాల‌యానికి కేసీఆర్ ! ఎందుకో తెలుసా ?

By:  Tupaki Desk   |   20 April 2022 2:30 AM GMT
ఆహా ! : కొత్త స‌చివాల‌యానికి కేసీఆర్ ! ఎందుకో తెలుసా ?
X
తొలుత భాగ్యన‌గ‌రి త‌రువాత సిద్ధిపేట త‌రువాత క‌రీంన‌గ‌ర్ ఆ తరువాతే వ‌రంగ‌ల్ ఇంకా వీలుంటే ఖ‌మ్మం ఇవీ తెలంగాణ స‌ర్కారు ప్రాధాన్యాలు.. సంప‌ద సృష్టి కేంద్రంగా హైద్రాబాద్ నే చూపిస్తున్నారు కేసీఆర్.. ఆ విధంగా ఆయ‌న కొంత ప‌రిణితి కూడా సాధించారు. అదేవిధంగా డెవ‌ల‌ప్మెంట్ ఫ్యాక్ట‌ర్స్ ను కూడా ప్రొజెక్ట్ చేసుకునేందుకు వీలుగా ఆయ‌న మ‌రికొన్ని ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

అందుకే సంక్షేమ ప‌థ‌కాల‌కు నిధులు ఇస్తూనే వీలున్నంత మేర అభివృద్ధికీ ఉన్న‌త రీతిలో ప్రాముఖ్యం ఇస్తున్నారు.ఆ క్ర‌మంలో త‌న క‌ల‌ల సామ్ర‌జ్య విస్త‌ర‌ణ‌లో భాగంగా ఇప్ప‌టికే కొన్ని నిర్మాణాలు పూర్తి చేయించిన కేసీఆర్, ఇప్పుడిక స‌చివాల‌యం పూర్తి చేయించి ఆధునిక హంగుల‌తో దేశానికే త‌ల‌మానికంగా ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్న వైన‌మే
న‌భూతో !

కొన్ని విష‌యాల్లో ఆయ‌న స్ప‌ష్టంగా ఉంటారు..కొన్ని విష‌యాల్లో ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేస్తారు. డ‌బ్బులున్నా లేక‌పోయినా కూడా తాను అనుకున్న‌వి మాత్రం అమలు చేసేందుకు శ‌క్తి కొద్దీ ప‌ని చేస్తారు. ఆ విధంగా కేసీఆర్ మిగ‌తా వారి క‌న్నా డిఫ‌రెంట్ .. ఆ రోజు చంద్ర‌బాబు చేసిన ప‌నుల‌కు కొన‌సాగింపుగానే ఆయ‌న ఇవాళ తెలంగాణ పున‌ర్నిర్మాణానికి పూనిక వ‌హిస్తున్నారు అన్న‌ది వాస్త‌వం.

ఆ విధంగా ఆయ‌న కొన్ని అభివృద్ధి ప‌నుల‌కు ముగింపు ఇచ్చేందుకు ఇప్పుడు ప్ర‌థ‌మ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ కోవ‌లో ఆ తోవ‌లో ఉద్యోగుల‌కు ఉన్న‌త సాంకేతిక ప్ర‌మాణాల‌తో కూడిన స‌చివాల‌యం అందించాల‌న్న త‌ప‌న‌లో భాగంగా సంబంధిత ప్ర‌క్రియ‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించి, త‌న‌దైన శైలిలో కొన్ని సూచ‌న‌లు ఇచ్చి రావ‌డం ఇవాళ జ‌రిగిన కీల‌క పరిణామం.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న వంతుగా అభివృద్ధి ప‌నుల‌ను ముఖ్యంగా ఆయ‌న క‌ల‌ల సౌధం కొత్త స‌చివాల‌య ప‌నుల‌ను వేగ‌వంతం చేసేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు. పాత స‌చివాల‌యం వ‌ద్ద‌నుకుని, సంచల‌నాత్మ‌క రీతిలో నిర్ణ‌యాలు తీసుకుని కొత్త నిర్మాణాల‌కు పూనిక వ‌హించిన కేసీఆర్ అందుకు అనుగుణంగా ప‌నుల‌ను వేగవంతం చేయిస్తున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ ఆయ‌న కొత్త సచివాలయ నిర్మాణాల‌ను కొద్ది సేప‌టి క్రింద‌ట ప‌రిశీలించి నిర్మాణానికి సంబంధించి కొన్ని సూచ‌న‌లు చేసి వ‌చ్చారు. ఇంత‌వ‌ర‌కూ స‌చివాల‌య సంద‌ర్శ‌న‌కే రాని సీఎంగా పేరున్న కేసీఆర్ ఇక‌పై ఆ పంథాను వీడుతార‌ని తాము ఆశిస్తున్నామ‌ని విప‌క్షాలు కామెంట్లు చేస్తున్నాయి.

ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ప‌నుల‌లో నాణ్య‌త‌ను, అదేవిధంగా నిర్మాణంలో వైశిష్ట్యాన్ని పాటించాల‌ని, డిజైనింగ్ మ‌రియు స్ట్ర‌క్చ‌ర్ అన్న‌వి విభిన్నంగా ఉండాల‌ని అధికారుల‌ను ఆదేశించి వ‌చ్చారు. త‌న హ‌యాంలోనే కొత్త స‌చివాల‌యం పూర్తి చేసుకున్నామ‌న్న సంతృప్తితోనే కేసీఆర్ ఈ సారి ప‌ద‌వి నుంచి దిగిపోవాల‌ని అనుకుంటున్నారు. దీన్నొక అభివృద్ధి న‌మూనాగా చూపించాల‌ని తాప‌త్ర‌య ప‌డుతున్నారు.

వాస్త‌వానికి ఏళ్ల కాలం నాటి సచివాల‌యం కార‌ణంగా ఇబ్బందులు రాకున్నా ఎందుకనో కేసీఆర్ నాటి భ‌వంతుల‌ను వ‌ద్ద‌నుకున్నారు. ఇందులో ఏపీకి చెందిన భ‌వంతులు కూడా ఉన్నాయి. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన గౌర‌వ ముఖ్య‌మంత్రులు ఆ రోజు వాటి తాళాల‌ను కేసీఆర్ కు అప్ప‌గించి ఉమ్మ‌డి ఆస్తుల విష‌య‌మై ఏమీ తేల్చుకోకుండానే వ‌చ్చేశారు.

దీంతో వాటి సంగ‌తి ఇప్ప‌టికీ తేల‌లేదు. ఎలానూ ఉమ్మ‌డి రాజ‌ధాని క‌థ 2024తో ముగియ‌నుండ‌డంతో ఇక వాటి క‌థ కూడా ముగిసింద‌నే భావించాలి. అంటే ఆస్తుల లెక్క‌లు సాధించ‌డంలో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులూ విఫ‌లం అయ్యార‌న్న‌దే సుస్ప‌ష్టం. తెలంగాణ స‌చివాల‌యం నిర్మాణం అంత వేగంగా సాగుతోంది కానీ ఏపీ స‌చివాల‌యం సంబంధిత ప‌నులు కొన్ని ఇప్ప‌టికీ అలానే ఆగి ఉన్నాయి. అదే ఏపీకీ మ‌రియు టీజీకీ ఉన్న తేడా ?