Begin typing your search above and press return to search.
దుర్గమ్మ మొక్కు తీర్చేసుకున్న కేసీఆర్
By: Tupaki Desk | 28 Jun 2018 10:03 AM GMTతెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బెజవాడ దుర్గమ్మకు ముక్కుపుడకను ఇస్తామంటూ టీఆర్ ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ మొక్కుకున్న మొక్కును.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లకు తీర్చుకున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెజవాడకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. ఏపీ మంత్రి దేవినేని ఉమా.. అధికారులు స్వాగతం పలికారు.
ఎయిర్ పోర్టు నుంచి గేట్ వే హోటల్ కు వెళ్లిన కేసీఆర్ అక్కడి నుంచి మధ్యాహ్నం 12.50 గంటలకు దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. సొంత కాన్వాయ్ లో దుర్గగుడి వద్దకు వచ్చిన కేసీఆర్ కు ఆలయ మండపం వద్ద ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా.. పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ దుర్గమ్మను దర్శించుకున్నారు.
దాదాపు 40 నిమిషాల పాటు దుర్గమ్మ సన్నిధిలో గడిపిన కేసీఆర్.. తాను మొక్కుకున్న రీతిలో అమ్మవారికి బంగారు ముక్కుపుడకను ఆలయ అధికారులకు అందించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి.. ఎంపీలు కేకే.. బాల్క సుమన్ లు ఉన్నారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా బెజవాడలో ఏపీ.. తెలంగాణ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో తప్పు పట్టి.. విభజన తర్వాత హైదరాబాద్ లో ఉండేందుకు ఏ మాత్రం ఇష్టపడక.. మొదటి రోజు నుంచీ విజయవాడలోనే తన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసుకున్న మంత్రి దేవినేని ఉమ కేసీఆర్ పర్యటన పర్యవేక్ష బాధ్యతల్ని చేపట్టటం ఆసక్తికరంగా చెప్పాలి.