Begin typing your search above and press return to search.
భట్టి మాటల్ని కేసీఆర్ మనసులోకి తీసుకుంటారా?
By: Tupaki Desk | 14 March 2020 4:30 PM GMTనాకు నచ్చని ఒకే ఒక్క పదం.. అంటూ అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన పవర్ ఫుల్ డైలాగు మాదిరి కాకున్నా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు విపక్షాలు చేసే విమర్శలు ఏ మాత్రం ఇష్టపడరు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి వారు చేసే వ్యాఖ్యలకు ఆయన కయ్యిమంటారు. తీవ్రస్థాయిలో విరుచుకుపడతారు. ఇవన్నీ చూసినప్పుడు విపక్షాలు చెప్పేవేమీ కేసీఆర్ వినిపించుకోరన్న భావన కలగటం ఖాయం. కానీ.. కేసీఆర్ తీరును తరచి చూస్తే.. కొత్త విషయాలు కనిపిస్తాయి. పైకి కనిపించినట్లుగా తనను తప్పు పట్టినోళ్లను ఏ మాత్రం ఉపేక్షించని కేసీఆర్.. లోలోన మాత్రం వారు చెప్పే మాటల్ని సీరియస్ గా తీసుకోవటం కనిపిస్తుంది.
విపక్ష నేతల్లో ఎవరైనా ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పినా.. వారు చెప్పిన దాన్లో అర్థవంతంగా అనిపిస్తే చాలు.. వాటిని స్వీకరించటమే కాదు.. ఆ అంశాల మీద తానేం చేయాలనుకున్న విషయాల్ని చెప్పేసే తీరు ఆయనకు మాత్రమే సొంతమని చెప్పాలి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క.. చిన్నపంచాయితీల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని.. నిధులు అందక ఇబ్బందులు పడుతుంటారని ప్రస్తావించారు.
దీన్లోని వాస్తవాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ స్పందించటమే కాదు.. తమ ప్రభుత్వం ఏమేం చేయాలనుకున్న విషయాన్ని వివరంగా చెప్పుకొచ్చారు. కావాలంటే ఎమ్మెల్యేల జీతాల్లో కోత పెట్టి అయినా నెలనెలా నిధులు ఇస్తానని చెప్పటం విశేషం. పంచాయితీలో ట్రాక్టర్.. ట్రాలీ.. ట్యాంకు లాంటివి కొనుగోళ్లు చేస్తే నిధులు అయిపోతాయన్న భయం వద్దన్నారు.
చిన్న పంచాయితీల పరిస్థితి ఆందోళనకరమని విపక్ష నేత భట్టి విక్రమార్క చెప్పారని.. అలాంటి వాటికి నిధుల కొరత రాకుండా తాము జాగ్రత్తలు తీసుకుంటామని.. చిన్న పంచాయితీలకు నిధులు కొరత ఉండదని చెప్పారు. అంతేకాదు.. ప్రతి గ్రామ పంచాయితీకి రానున్న ఐదేళ్ల వ్యవధి లో రూ.40 లక్షలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలా.. తనను విమర్శించే భట్టి చేసిన సూచనలకు తానెంత ప్రాధాన్యత ఇస్తానన్న విషయాన్నికేసీఆర్ తన మాటల్లో చెప్పేశారు. అదే కేసీఆర్ ను తిరుగు లేని అధినేత గా మారుస్తుందని చెప్పక తప్పదు.