Begin typing your search above and press return to search.
సారూ ఫీల్ అయ్యేలా అలా మాట్లాడతావేంది భట్టి?
By: Tupaki Desk | 17 March 2020 7:30 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను టెంప్ట్ చేయటం అంత తేలికైన విషయం కాదు. విమర్శలు చేస్తే విరుచుకుపడతారు. ఆధారాలు చూపిస్తే.. అవన్ని ఉత్తవనేస్తారు. పాయింట్ టు పాయింట్ పట్టుకొని నిలదీసే ప్రయత్నం చేస్తే.. తనదైన మాటలతో వాటన్నింటిని సింఫుల్ గా తేల్చేస్తారు. అయినా.. సారును విడిచి పెట్టకుండా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తే.. కఠినంగా మాట్లాడి.. వాతావరణంవేడెక్కినంతనే తనకు తాను జోకులేసి చల్లార్చటమే కాదు.. తనను ఇబ్బంది పెట్టాలనుకున్న నేతపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసి.. అందరు నవ్వేలా చేస్తారు. మొత్తంగా కింద పడినా పైచేయి తనదే అన్న విషయాన్ని అందరూ గుర్తించేలా చేయటంలో ఆయనకు తిరుగు లేదని చెప్పాలి.
అలాంటి కేసీఆర్.. తోక తొక్కిన తాచుపాములా బుస్సుమనటం.. సవాలుకు సిద్ధమా? మీ ఆరోపణల్ని నిరూపించండి.. రాజీనామాకు సిద్ధమన్నట్లుగా ఫైర్ కావటం ఇటీవల కాలంలో తరచూ కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా ముగిసిన బడ్జెట్ సమావేశాల ఆఖరి రోజున కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పై తీవ్ర ఆరోపణల్ని సంధించారు.
ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి పై తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించాలని.. అప్పటి కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తే సాధ్యం కాలేదన్నారు. కాళేశ్వరం వద్ద వంద మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇలా నిర్మించేందుకు మహరాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించారా? లేక వాళ్లే మిమ్మల్ని పిలిచి ఒప్పించారా? అని ప్రశ్నించారు. ఇలాంటి మాటల్ని అస్సలు భరించలేని కేసీఆర్.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడితో ఆగితే ఆయన కేసీఆర్ ఎందుకు అవుతారు చెప్పండి?
సభ్యుడు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని..గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాలపై మహారాష్ట్ర తో ఏదైనా ఒప్పందం చేసుకొని ఉంటే తాను రాజీనామా చేస్తానని హెచ్చరించారు. అసలు మహారాష్ట్ర తో ఎలాంటి ఒప్పందం లేదని తేల్చేశారు. గతంలో చేసిన ఒప్పందం ఉంటే తన పదవికి రాజీనామా చేస్తానంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి రావటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరెన్ని మాటలన్నా.. రాజీనామా వరకూ వెళ్లని కేసీఆర్.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఆయన నోటి నుంచి పదవీ త్యాగం మాట రావటం విశేషంగా చెప్పక తప్పదు.