Begin typing your search above and press return to search.

కేసీఆర్ వ‌ర్సెస్ త‌మిళిసై.. మ‌రింత ముదిరిన వ్య‌వ‌హారం... పీఎంకు ఫిర్యాదులు

By:  Tupaki Desk   |   6 April 2022 9:37 AM GMT
కేసీఆర్ వ‌ర్సెస్ త‌మిళిసై.. మ‌రింత ముదిరిన వ్య‌వ‌హారం... పీఎంకు ఫిర్యాదులు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై.. ఫిర్యాదుల‌పై ఫిర్యాదులు చేశారు. తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిసిన త‌మిళిసై.. రాష్ట్రంలో ఇటీవల పరిణామాలను వివరించినట్లు తెలిసింది. ప్రొటోకాల్ వివాదంపైనా ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించారని.. అనేక కార్యక్రమాల్లో తనను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని గవర్నర్‌ తమిళిసై ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

మొత్తానికి తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సైల మధ్య జరుగుతున్న వివాదం హస్తినకు చేరిం ది. నేడు ప్రధాని మోడీని తెలంగాణ గవర్నర్ తమిళిసై కలిశారు. తెలంగాణలో ప్రొటోకాల్ వివాదంపై ప్రధానికి ఫిర్యాదు చేశారు. అనేక విషయాల్లో అసలు తనను పట్టించుకోలేదని తమిళిసై వివరించారు.

అంతేకాదు.. ఉగాది పండుగ రోజు తాను అధికారికంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి సీఎం స‌హా ఉన్న‌తా ధికారుల‌ను ఆహ్వానించాన‌ని.. అయినా.. ఎవ‌రూ రాలేద‌ని.. ఇది త‌న‌ను అవ‌మానించ‌డ మేన‌ని.. ప్ర‌ధానికి త‌న గోడు వెళ్ల‌బోసుకున్న‌ట్టు తెలిసింది.

అనంతరం తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. "వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపా. పుదుచ్చేరి- తెలంగాణ మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపాలని కోరాను. తెలంగాణలో ఏం జరుగు తుందో అందరికీ తెలుసు. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు.. ఫ్రెండ్లీ గవర్నర్‌ను. నేను రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటా. రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసేందుకు ప్రధానిని కలవలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచాలని ప్రధానిని కోరా. నాపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోంది. మహిళా గవర్నర్‌ను అవమానిస్తున్నారు. గవర్నర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు." అని వివ‌రించారు.

అంతేకాదు.. "ప్రొటోకాల్ పాటించాల్సిన బాధ్యత ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి ఉంది. వ్యక్తిని కాకుండా వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలి. రాజ్యాంగాన్ని, వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంలో వివాదమేమీ లేదు. కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. ప్రభుత్వం సూచించిన వ్యక్తి ఎలాంటి సేవ చేయలేదని నేను భావించా. నా అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పా. కౌశిక్‌రెడ్డి పేరు సిఫారసుపై నేను సంతృప్తి చెందలేదు. అందుకే ఆ ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టాల్సి వచ్చింది." అని తెలిపారు.

అదేవిధంగా కొన్ని కారణాలను సాకుగా చూపి.. గవర్నర్ కార్యాలయాన్ని అవమానించడం సరికాదన్నారు. తాను ఏ విషయంలో రాజకీయాలు చేశానో బయటపెట్టాలని స‌వాల్ విసిరారు. సీఎం ఏ విషయంపై అయినా త‌న‌తో నేరుగా వచ్చి చర్చించవచ్చున‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో గిరిజనుల సమస్యలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లానని.. గవర్నర్‌ తమిళిసై తెలిపారు. తెలంగాణలో 11 శాతం గిరిజన జనాభా ఉందని.. వాళ్ల సమస్యలపై తాను దృష్టిపెట్టిన విషయాన్ని ప్రధానికి తెలిపానన్నారు. ఇటీవల గిరిజన ప్రాంతాల్లో పర్యటనలతో సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని మోడీకి వివరించానని.. తమిళిసై వెల్లడించారు. ఇక‌, ఈ ప‌ర్య‌ట‌న‌పై కేసీఆర్ అండ్ కో రియాక్ట్ అవుతారో చూడాలి.