Begin typing your search above and press return to search.
దరిద్రపు ఇగో.. కేసీఆర్ టైం ఎంత వేస్ట్ చేసిందంటే?
By: Tupaki Desk | 8 Nov 2019 2:30 PM GMTఇరవై ఏళ్ల క్రితం ఇగో అన్న మాట చాలా తక్కువమంది నోట వినిపించేది. పదేళ్ల క్రితం కూడా కూసింత తక్కువే. కానీ.. ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటా వినిపించటమే కాదు.. చాలామంది ఇగోకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచేస్తున్నారు. సామాన్యుల సంగతే ఇలా ఉంటే.. సారు లాంటోళ్ల ఇగో ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విషయాల్ని వ్యక్తిగతంగా తీసుకోవటమే కాదు.. ఇగోయిస్టిక్ గా పోవటంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె అంతకంతకూ జఠిలం కావటమే కాదు.. హైకోర్టు చేత పలుమార్లు మాట పడాల్సి వచ్చింది. అయినప్పటికీ వెనక్కి తగ్గని కేసీఆర్.. ఆర్టీసీ సమ్మె లెక్క తేలాల్సిందేనన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
దాదాపు ఐదు వారాలకు దగ్గర పడుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో సీఎం వ్యవహరిస్తున్న ఇగో.. ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. శాఖల పరంగా సమీక్షలకు దూరంగా ఉంటే సీఎం కేసీఆర్.. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా దాదాపు 14 సమీక్షల్ని నిర్వహించారు.
కార్మికులు సమ్మెకు ప్రారంభంలో మొదలైన సమీక్షల పర్వం ఇప్పటివరకూ పెద్ద ఎత్తున సాగుతోంది. ఒక అంశం మీద సీఎం హోదాలో కేసీఆర్ ఇన్నేసి సమీక్షలు నిర్వహించటం ఇదే తొలిసారి అంటున్నారు. సీఎం చేస్తున్న సమీక్షల సంఖ్య పెరిగే కొద్దీ.. ఎదురవుతున్న తిప్పలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయని చెప్పక తప్పదు.
తాజాగా హైకోర్టు వ్యాఖ్యలు చూసిన తర్వాత అయినా ప్రభుత్వం కాస్తంత ఔదార్యం ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్న మాట వినిపించక మానదు. ఆర్టీసీ ఇష్యూలో కేసీఆర్ ఇప్పటివరకూ వెచ్చించిన సమయం ఏకంగా 44 గంటలు కావటం గమనార్హం. ముఖ్యమంత్రి హోదాలో 14 సమీక్షలు నిర్వహించి.. 44 గంటల సమయాన్ని వెచ్చించటంతో పాటు ఒక కలెక్టర్ల సదస్సును నిర్వహించినప్పటికి ఫలితం మాత్రం సానుకూలంగా లేకపోగా.. కోర్టు నుంచి ఇబ్బందికర వ్యాఖ్యలు వినాల్సిన పరిస్థితి.
ఎందుకిలాంటి పరిస్థితి అంటే.. తాను అనుకున్నట్లే జరగాలన్న మొండితనం.. పట్టుదలేనని చెప్పక తప్పదు. పంతాన్ని నెరవేర్చుకోవటంతో పాటు.. తాను చెప్పినట్లు ఆర్టీసీ కార్మికులు మాట వినాలనుకోవటమే కారణంగా చెప్పక తప్పదు. దరిద్రపుగొట్టు ఇగోను కేసీఆర్ పక్కన పెట్టి.. తనలోని ఉద్యమనేతను బయటకు తీస్తే.. ఇష్యూ నిమిషాల్లో సెటిల్ కావటం ఖాయం. అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ హోదాలో.. తాను అనుకున్నది అనుకున్నట్లు జరగాలన్న పట్టుదలతో ఎన్ని సమీక్షలు జరిపినా.. అందుకోసం ఎన్ని గంటలు వెచ్చించినా సానుకూల ఫలితం చేకూరదన్నది మర్చిపోకూడదు.