Begin typing your search above and press return to search.
ఆశీస్సులు..హారతులు..వెరసి సీఎం కావటమే ఆలస్యమా?
By: Tupaki Desk | 26 Jan 2020 4:34 AM GMTఅదిగో నిర్ణయం వచ్చేస్తుంది. ఇదిగో.. ఇక ముఖ్యమంత్రిని చేసేస్తారు. ఇలా వరుస వాదనలతో పాటు.. అప్పుడు మీడియాలో వచ్చే కథనాలు వెరసి.. తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ అప్రకటిత ముఖ్యమంత్రిగా మారిపోయారు. మరే రాష్ట్రంలో లేని రీతిలో.. తన పరిధిలోని శాఖలతో సమన్వయం చేస్తూనే.. వివిధ విభాగాలతో సమీక్షలు నిర్వహించటం.. రాష్ట్రానికి వచ్చేప్రముఖుల్ని కలవటం.. వివిధ సదస్సుల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించటం ద్వారా తన సత్తాను చాటుతున్న కేటీఆర్.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటమే మిగిలి ఉంది.
ఏ పని చేసినా ఒకటికి పదిసార్లు ఆలోచించి.. ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకునే కేసీఆర్..తన కుమారుడికి పట్టాభిషేకాన్ని చేసే విషయంలో మరెంతగా ఆలోచిస్తారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సరైన టైంలో తన కొడుకును సీఎంగా లాంఛ్ చేయాలని భావిస్తున్న ఆయన ఆలోచనలకు తగ్గట్లే.. వాతావరణం కూడా ఇప్పుడు కలిసి వస్తుందా? అంటే అవునని చెబుతున్నారు.
రెండు రోజుల క్రితం ముగిసిన కేటీఆర్ దావోస్ పర్యటన సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని కేటీఆర్ కలవటమే కాదు.. వారితో భేటీ అయిన విధానం.. ఆయా వేదికల మీద ఆయనిచ్చిన సందేశాలు చూసినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ మాత్రం తగ్గని తీరు కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా వెల్లడైన పుర ఎన్నికల ఫలితాల్ని చూసినప్పుడు కేటీఆర్ స్వయంగా పావులు కదిపిన ఈ ఎన్నికల్లో ఫలితాలు తిరుగులేని రీతిలో రావటం తెలిసిందే. దీంతో.. తన కొడుకు సత్తా ఏపాటిదన్న విషయాన్ని రాజకీయ ప్రత్యర్థులకు మాత్రమే కాదు..రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా చేసిన కేటీఆర్.. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే తాజా పరిణామాలు దీనికి నిదర్శనంగా చెప్పక తప్పదు.
తాజా ప్రెస్ మీట్ ప్రారంభంలోనే కేటీఆర్ కు ఆశీస్సులన్న మాటతోపాటు.. సీఏఏ విషయంలో ప్రధాని మోడీ తీరును తీవ్రంగా తప్పు పడుతూ ఘాటు వ్యాఖ్యలు చేసిన వేళ.. పిల్లగాళ్లు బాగానే చూసుకుంటున్నారన్న మాటలు చూస్తే.. రాష్ట్ర పగ్గాలు కొడుక్కి అప్పజెప్పి జాతీయ రాజకీయాల దిశగా కేసీఆర్ అడుగులు వేయాలన్న ఆలోచనలో ఉన్నారా? అంటే అవుననే చెప్పాలి. ఈ వాదనకు బలం చేకూరేలా.. ఇంటికి వెళ్లిన కేటీఆర్ కు ప్రత్యేకంగా విజయ హారతితో స్వాగతం పలకటం చూస్తే.. ఎన్నాళ్లుగానో చెబుతున్న తెలంగాణకు కాబోయే సీఎం వాదన వాస్తవరూపం దాల్చటానికి పెద్ద సమయం లేదని చెప్పక తప్పదు.