Begin typing your search above and press return to search.
వాళ్ల స్కాంలు తెలుసు... కేసీఆర్ హెచ్చరిక
By: Tupaki Desk | 19 Dec 2018 8:57 AM GMTతెలంగాణలోని ప్రతిపక్ష నాయకులకు కేసీఆర్ గట్టి హెచ్చరికలు పంపారు. కాంగ్రెస్ నేతల తాజా ఆరోపణలు ప్రస్తావిస్తూ ఎన్నికల్లో ఓటమితోనైనా తీరు మార్చుకోవాలని .. తన గురించి కానీ.. తన ప్రభుత్వం గురించి కానీ దుర్భాషలాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. వాళ్లను విడిచిపెట్టను అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించినట్టు సమాచారం..
రెండోసారి తనను ప్రజలు ఆశీర్వదించిన నేపథ్యంలో ఈసారి తాను మొత్తం పాలనపైనే దృష్టి కేంద్రీకరించానని.. ఎవరికీ వ్యతిరేకంగా వ్యవహరించడం కానీ.. విమర్శించడం కానీ చేయనని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఇలానే నోరుపారేసుకుంటే వారు గతంలో చేసిన కుంభకోణాలు.. లొసుగులు బయటకు తీస్తానని ప్రత్యక్ష హెచ్చరికలు పంపారు. తాను ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలపై ఏమీ కక్ష సాధింపు చర్యలకు దిగనని.. వారు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే మాత్రం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తనకు కాంగ్రెసోళ్లు చేసిన అవినీతి.. తిన్న డబ్బుల గురించి అంతా తెలుసన్నారు.
‘‘ప్రస్తుతం బంగారు తెలంగాణ సాధన దిశగా తాను పురోగమిస్తున్నా.. దేశంలోనే తెలంగాణను నంబర్ 1 స్టేట్ గా తీర్చిదిద్దుతా.. నా దృష్టంతా ఇప్పుడు అభివృద్ధిపైనే.. గతంలో ఏమేం జరిగినా ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేయలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తే మాత్రం ఎవ్వరినీ వదిలిపెట్టను.. దొంగల బాగోతాన్ని బయటపెడుతాను’ అంటూ కేసీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.