Begin typing your search above and press return to search.

కోపాన్ని.. ప్రేమ‌ను ఒకేసారి చూపించిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   27 Oct 2017 6:03 AM GMT
కోపాన్ని.. ప్రేమ‌ను ఒకేసారి చూపించిన కేసీఆర్‌
X
అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో స‌భ‌లో వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు గురించి చెప్పేందుకు వీలుగా మంత్రులు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేల‌తో కేసీఆర్ స‌మావేశం కావ‌టం తెలిసిందే. ఎప్ప‌టి మాదిరి సుదీర్ఘంగా సాగిన ఈ స‌మావేశంలో టీఆర్ఎస్ నేత‌ల‌కు చాలానే అనుభూతుల్ని మిగిల్చారు కేసీఆర్. స‌మావేశంలో ప్ర‌సంగించిన సంద‌ర్భంగా ప‌లు వివాదాల్ని ట‌చ్ చేసిన కేసీఆర్‌.. ఒక ఎమ్మెల్సీకి వార్నింగ్ ఇవ్వ‌గా.. మ‌రో ఎమ్మెల్సీకి క్లీన్ చిట్ ఇవ్వ‌టం గ‌మ‌నార్హం.

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలే సుప్రీం అని తేల్చిన కేసీఆర్‌.. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్సీలు.. మంత్రులు వేలు పెట్టొద్ద‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ భూప‌తిరెడ్డిని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవ‌ల తెర మీద‌కు వ‌చ్చిన వివాదాన్ని ప్ర‌స్తావించిన కేసీఆర్‌.. ఆయ‌న‌పై ఫైర్ అయ్యారు. నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ భూప‌తిరెడ్డి తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టిన కేసీఆర్‌.. నీకు రూపాయి ఖ‌ర్చు లేకుండా ఎమ్మెల్సీని చేసుకున్నాం. కానీ.. నీ తీరు మంచిగా లేదు. మ‌న పార్టీ ఎమ్మెల్యే.. ఎంపీటీసీల‌పైనే కేసులు పెడ‌తావా? నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే బ‌తిమిలాడినా కేసు వెన‌క్కి తీసుకోవా? అంటూ తీవ్ర‌స్థాయిలోధ్వ‌జ‌మెత్తిన‌ట్లుగా చెబుతున్నారు. ఊహించ‌ని రీతిలో అధినేత ఆగ్ర‌హాన్ని చూసిన భూప‌తిరెడ్డి అవాక్కు కాగా.. స‌మావేశం కాస్తా గంభీరంగా మారిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ వివాదం త‌ర్వాత మ‌రో ఎమ్మెల్యే ఫారూఖ్ ఇంటి వివాదాన్ని సీఎం కేసీఆర్ ప్ర‌స్తావించారు. ఒక ఎన్ ఆర్ ఐ మ‌హిళ ఇంట్లో అద్దెకు ఉన్న ఎమ్మెల్సీ ఫారూఖ్ ఇంటిని ఖాళీ చేయ‌మంటే ఖాళీ చేయ‌టం లేద‌ని.. త‌న‌ను తిట్టిన‌ట్లుగా స‌ద‌రు మ‌హిళ ఆరోపించి.. మీడియాకు ఎక్క‌టం తెలిసిందే. అయితే.. ఈ ఉదంతంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ ది ఎలాంటి త‌ప్పు లేద‌ని తేల్చారు.

మంచిగా ఉన్నామంటే బ‌ద్నాం చేస్తార‌ని.. లంగ వేషాలు వేస్తారంటూ మండిప‌డిన కేసీఆర్‌.. తోటి ఎమ్మెల్సీల‌పై ఎవ‌రైనా ఆరోప‌ణ‌లు చేసిన‌ప్పుడు మిగిలిన నేత‌లంతా క‌లిసి మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని.. త‌ప్పును ఖండించాలే త‌ప్పించి మౌనంగా ఉండ‌కూడ‌ద‌న్నారు. ఈ విష‌యంలో పార్టీ నేత‌ల తీరు ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా టీఆర్ ఎస్ నేత‌ను గంజాయి కేసులో ఇరికించేందుకు మాజీ మంత్రి శ్రీధ‌ర్ బాబు ప్ర‌య‌త్నించిన ఉదంతాన్ని ప్ర‌స్తావించారు. ఇలాంటి సంద‌ర్భాల్లో తోటి నేత‌లంతా అండ‌గా నిల‌వాల‌ని.. స్పందించాల‌న్నారు. శ్రీధ‌ర్ బాబు చేసింది మంచి ప‌ని కాద‌ని.. ఆయ‌న గురించి తాను అసెంబ్లీలో మాట్లాడ‌తాన‌ని చెప్పారు.