Begin typing your search above and press return to search.

కరెంట్ బిల్లు కట్టకుంటే పదవికి వేటు.. సారు లేటెస్ట్ వార్నింగ్

By:  Tupaki Desk   |   1 Aug 2019 4:38 AM GMT
కరెంట్ బిల్లు కట్టకుంటే పదవికి వేటు.. సారు లేటెస్ట్ వార్నింగ్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చేశారు. కరెంటు బిల్లులు కట్టని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు.. అధికారులపై వేటు వేయాలన్ననిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు. ప్రతి నెలా కట్టాల్సిన కరెంటు బిల్లులు సక్రమంగా కట్టకపోవటం పెద్ద సమస్యగా మారింది. డిస్కం లకు గుది బండగా మారిన అప్పుతో విద్యుత్ సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.

కేంద్రం అమల్లోకి తెచ్చిన కొత్త విధానంలో రాష్ట్రాలు విద్యుత్ ను ముందుగా డబ్బు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ.. డబ్బులు చెల్లించకుంటే వాటికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. ప్రీపెయిడ్ కనెక్షన్ ఉన్న మన ఫోన్లో బ్యాలెన్స్ అయిన వెంటనే అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్లటం ఎలా ఆగిపోతాయో.. కరెంటు కోసం రాష్ట్రాలు కట్టే మొత్తం అయిపోయిన వెంటనే విద్యుత్ ను నిలిపివేస్తారు. అంతేకాదు.. పాత బకాయిల్ని చెల్లించాల్సిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వరకూ వస్తే.. భారీ ఎత్తున బకాయిలు డిస్కంలు పడ్డాయి. ఎందుకిలా అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థలు..కార్పొరేషన్లు.. నగర పాలక సంస్థలు.. మున్సిపాలిటీ.. పంచాయితీలు ఏకంగా రూ.8920 కోట్లు డిస్కంలకు చెల్లించాల్సి ఉంది. దీంతో.. సదరు సంస్థ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా మారిన కొత్త రూల్స్ కు అనుగుణంగా విద్యుత్ సంస్థలకు అప్పులు పెట్టే ప్రభుత్వ సంస్థలు ఇకపై బకాయిలు అన్నవి ఉండకూడదని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి నెలా అందరూ విద్యుత్ బిల్లులు బకాయిలు పెట్టకుండా చెల్లించాలని.. ఒకవేళ సకాలంలో బిల్లులు చెల్లించని పక్షంలో గ్రామాల్లో సర్పంచ్.. గ్రామ కార్యదర్శి.. మునిసిపాలిటీల్లో అయితే ఛైర్ పర్సన్.. కమిషనర్లపై వేటు తప్పదని తేల్చేశారు. మరి.. కేసీఆర్ వార్నింగ్ కు కరెంటు బిల్లులు కట్టే విషయంలో మార్పు వస్తుందేమో చూడాలి.