Begin typing your search above and press return to search.
66 ఇయర్స్ కేసీఆర్.. నో ఫియర్ అంట..
By: Tupaki Desk | 26 Feb 2019 4:34 AM GMTకేసీఆర్ వార్ధాక్య వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తనకు 66 ఏళ్లు వచ్చాయని.. ఏ చీకు చింతా లేదని.. నాకేమీ అలిగేషన్స్ లేవని.. ఇక ప్రజాసేవలోనే తరిస్తానని.. నన్నెవరూ ప్రభావితం చేసి భయపెట్టలేరని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు..
అసెంబ్లీలో కేసీఆర్ ఏమాత్రం భయం - భక్తి - బెరుకు లేకుండా ప్రతిపక్ష కాంగ్రెస్ ను నిన్న చెడుగుడేశాడు. మోడీని ఏకీపారేశాడు. తెలంగాణ సాధించాక ఇక నాకు ఉన్న టార్గెట్ బంగారు తెలంగాణ నిర్మాణమేనని.. అది సాధించేందుకు నీతి నిజాయితీతో పనిచేస్తానన్నారు. మరో 5 ఏళ్లు మాత్రమే తనలో పనిచేస్తే సత్తా ఉండొచ్చని.. అందుకే నాకు ఎలాంటి భయం లేదని.. నేనెవ్వరికీ భయపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ వయసు 66 ఏళ్లు దాటింది.. ఈ ఐదేళ్లలో 71 ఏళ్లు వస్తుంది. అందుకే తన కుమారుడికి పార్టీ పగ్గాలు.. తన తర్వాత ప్రభుత్వ పగ్గాలు ఇచ్చేశాడు. ఇప్పుడు తెలంగాణలో అవినీతి రహిత - మెరుగైన పాలన కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వయోభారం మీద పడకముందే తెలంగాణలోని వ్యవస్థలను సెట్ రైట్ చేసే పనిలో పడ్డారు. ఒక్కసారి సెట్ అయితే ఇక తన తర్వాత వచ్చే వారసుడికి పాలన ఈజీ అయ్యి తెలంగాణ రాష్ట్ర సమితికి భవిష్యత్ బాగుంటుందని కేసీఆర్ స్కెచ్ గీశారు.
తెలంగాణలో రెవెన్యూ - రిజిస్ట్రేషన్ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించేందుకే తన దగ్గర ఆ శాఖలు పెట్టుకున్నానని.. దీనిపై ఓ పత్రికాయన ఎడిటోరియల్ రాసి కీలక శాఖలన్నీ కేసీఆర్ వద్దేనన్నాడని ఆరోపించాడని.... అసలు కారణం ఇదీ అంటూ కేసీఆర్ వివరించారు. కేసీఆర్ గడిచిన నాలుగున్నరేళ్లుగా ప్రజలకు పాలన చేరువ చేసి పథకాలను క్షేత్రస్థాయికి అందించారు. ఇప్పుడు రెవెన్యూ - రిజిస్ట్రేషన్ శాఖలపై పడ్డారు. రాబోయే రెండేళ్లలోనే వాటిలోనూ ప్రక్షాళన చేస్తారట.. వయసు పెరగడం.. వేరే అలిగేషన్స్ లేకపోవడంతో కేసీఆర్ స్వేచ్ఛగా పాలిస్తున్నారు. ప్రజలకు అంతే స్వేచ్ఛనిస్తున్నారు.