Begin typing your search above and press return to search.
కర్ర కాల్చి వాత పెడతా..బండకేసి కొట్టి పార్టీ నుంచి బయటకు పంపుతా
By: Tupaki Desk | 8 Feb 2021 4:02 AM GMTఅందరూ అవునంటే.. తాను కాదన్నట్లు.. అందరి ఆలోచనలు ఒకలా ఉంటే.. అందుకు భిన్నంగా ఆలోచించే తత్త్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నోసార్లు తన తీరుతో షాకులు ఇచ్చిన వైనం తెలిసిందే. తాజాగా అలాంటి తీరునే మరోసారి ప్రదర్శించారు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ సీనియర్.. జూనియర్ అన్న తేడా లేకుండా టీఆర్ఎస్ నేతల నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలకు హోల్ సేల్ గా సమాధానం ఇచ్చేశారు. ఇప్పటివరకు అవకాశం లభిస్తే చాలు.. కాబోయే సీఎం కేటీఆర్.. అంటూ వ్యాఖ్యలు చేసే తీరుకు చెక్ చెప్పేసేలా ఆయన తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
ఇంతకాలం నేతలు నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలు.. దానికి మీడియాలో లభించిన ప్రాధాన్యత.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలించి.. నిశ్శబ్దంగా ఉన్న ఆయన.. తాజాగా నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు.. మంత్రులు.. పార్టీ ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు.. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్లు.. జడ్పీ చైర్ పర్సన్లు.. మేయర్లు.. డీసీసీబీ అధ్యక్షులు.. ఇలా పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు.
కొత్త ముఖ్యమంత్రి అంశంపై జరుగుతున్న చర్చకు పుల్ స్టాప్ చేసేలా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాటలు ఒకింత కఠినంగా.. నిష్ఠూరంగా ఉండటమే కాదు.. ఇక నుంచి కొత్త సీఎం గురించి మాట్లాడితే?.. అంతే సంగతులు అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. తీవ్ర పదజాలంతో వార్నింగ్ ఇచ్చేశారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో హైలెట్ అన్నట్లుగా ఉన్న వ్యాఖ్యల్ని చూస్తే.. పార్టీ నేతలకు కొత్త సీఎం అంశంపై ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలని ఫిక్స్ అయ్యారన్నది ఇట్టే అర్థమైపోతుంది.
- నాకేమైంది? మంచిగనే ఉన్నా కదా! ఆరోగ్యపరంగా బాగానే ఉన్నా.. దుక్కలా ఉన్నానని ఇదివరకే అసెంబ్లీ వేదికగా చెప్పాను కదా! అయినా మీకు క్లారిటీ రాకపోతే ఎట్లా? నేను నచ్చలేదా మీకు? ముఖ్యమంత్రి పదవికి నేను పనికిరానా? నేను మంచిగా పనిచేయడం లేదా? నన్ను సీఎంగా వద్దని అనుకుంటున్నారా చెప్పండి? ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేయాలని కోరుకుంటున్నారా? ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు.. అనవసరంగా ప్రజలను - పార్టీ శ్రేణులను ఎందుకు కన్ ప్యూజ్ చేస్తున్నారు?
- టీఆర్ ఎస్ పార్టీకి ఒక విధానం - నిర్మాణం ఉన్నాయి. ఒకవేళ మార్పులు - చేర్పులు చేయాలని అనుకుంటే - నేను కేంద్రానికి వెళ్లాలి - నా అవసరం అక్కడ ఉందని అనుకుంటే - మీ అందరినీ పిలుస్తా.. మాట్లాడుతా. అందరి అభిప్రాయాలతోనే ఏకగ్రీవంగా మార్పు చేస్తా. అనవసర రాద్ధాంతం - అక్కరలేని విషయాలు ఎందుకు? ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే పదవులు ఊడుతాయ్.
- ఉద్యమం ద్వారా ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన పేరు ముందు సీఎం పదవి నాకు ఓ లెక్కనా? అది నా ఎడమ కాలి చెప్పుతో సమానం. సీఎం పదవి లేకపోయినా తెలంగాణ తెచ్చినందుకు గాంధీ ఫొటో పక్కన నా ఫొటో పెట్టి పూజలు చేసేవాళ్లు.
- ఇప్పుడు పదవిలో ఉన్నోడు.. లేనోడు ఏది పడితే అది మాట్లాడుతున్నడు. ఇన్ని అవమానాలు - బాధలు భరించాల్సిన అక్కర నాకేం ఉంది ? తెచ్చిన తెలంగాణ ఆగం కావద్దని - రాష్ట్రాన్ని ఎవరికో అప్పగిస్తే అది ఎటో పోతుందని - అనుకున్నది చేస్తరో చేయరోనని.. బాగు చేద్దామని సీఎం పదవిలో కూర్చున్న. తప్పుడు కామెంట్లు చేసేటోణ్ని ఎవరినీ వదిలిపెట్టేది లేదు
- నేను మొదటి నుంచి నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేనే సుప్రీం అని చెబుతున్నా. మంత్రులు - ఇతరులు ఎవరూ అక్కడ వేలు పెట్టొద్దు. కానీ, దీనిని అలుసుగా తీసుకొని కొందరు ఎమ్మెల్యేలు ఒంటెద్దు పోకడలు పోతున్నారు. పద్ధతి మార్చుకోకపోతే అలాంటి వాళ్లను పీకి పారేస్తా. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తే - మళ్లీ వాళ్లకు పార్టీ టికెట్లు వస్తాయి. చెప్పినట్టు వినకపోతే పక్కకు తప్పించడం ఖాయం
- కొందరు ఎమ్మెల్యేలు - ప్రజాప్రతినిధులు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని, ఇకపై ఎవరైనా లూజ్ టాక్ చేస్తే బండకేసి కొట్టి.. పార్టీ నుంచి బయటకు పారేస్తా. బాధ్యత లేకుండా మాట్లాడిన వాళ్లు ప్రజల్లో చులకన అవుతారు. వారితోపాటు పార్టీకి కూడా నష్టం కలుగుతుందని గుర్తించాలి. ఎవరైనా గీత దాటితే సస్పెన్షన్ వేటు వేస్తాం. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తే మళ్లీ వాళ్లకు పార్టీ టికెట్లు వస్తాయి. నేను చెప్పినట్లు వినకుండా ముందుకు వెళితే వేటు ఖాయం.
- కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీనా ? దానికి ఎంత శ్రమ కావాలి? ఇదివరకు ఎన్ని పార్టీలు రాలేదు.. పోలేదు? నరేంద్ర - విజయశాంతి - దేవేందర్ గౌడ్ పెట్టిన పార్టీలు మట్టిలో కలిసిపోలేదా? నాలుగు రోజుల్లో తోక ముడుస్తారు. ఎటూకాకుండా తెరమరుగై పోతారు.