Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఇచ్చే టెకెట్ కు ‘మొక్క’కు లింకె?
By: Tupaki Desk | 2 Aug 2016 7:00 AM GMTదేశంలో ఇప్పటివరకూ మరే పార్టీ అధినేత పెట్టని కొత్త రూల్ ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడైన కేసీఆర్ పెడుతున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తాజాగా ఆయన చెప్పిన మాటలు వింటుంటే.. ఇది నిజమనించకమానదు. సూటిగా చెప్పకున్నా.. రానున్న రోజుల్లో టికెట్ ఆశించే వారు.. పదవులు కోరుకునే వారికి వారిలో ఎంత సామర్థ్యం ఉన్నా.. తన డ్రీం ప్రాజెక్టులలో ఒకటైన హరితహారంలో ఎన్ని చెట్లను సంరక్షించారన్న అంశం కూడా లెక్కలోకి వస్తుందన్నట్లుగా ఆయన తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
హరితహారం కార్యక్రమంతో తెలంగాణ రూపురేఖలు మార్చేయగలమని బలంగా నమ్ముతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా ఈ కార్యక్రమం మీద రివ్యూ ఒకటి నిర్వహించారు. పలువురు మంత్రులతో ఫోన్లో మాట్లాడిన సందర్భంగా హరితహారం కార్యక్రమం మీద కేసీఆర్ పలు సూచనలు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని లైట్ తీసుకుంటున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ప్రజాప్రతినిధులకు మరో అవకాశానికి మొక్కలు నాటటం కూడా ప్రామాణికంగా నిలుస్తుందన్న మాటను పరోక్షంగా చెప్పటం ద్వారా.. హరితహారం కార్యక్రమంలో యాక్టివ్ గా పాల్గొనాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పేశారు. హరితహారం కార్యక్రమంలో కొందరు బాగానే పని చేస్తున్నా.. మరికొందరు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న అసంతృప్తితో ఉన్న కేసీఆర్.. తాజాగా భవిష్యత్ టికెట్ కు లింకు పెట్టటం ఆసక్తికరంగా మారింది. మరి.. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన ఈ కొలమానం గులాబీ నేతల్ని ఎంతలా కదిలిస్తుందో చూడాలి.