Begin typing your search above and press return to search.

కేసీఆర్ హెచ్చరికల వెనుక కథేంటి?

By:  Tupaki Desk   |   5 Jan 2020 5:31 AM GMT
కేసీఆర్ హెచ్చరికల వెనుక కథేంటి?
X
ఆదేశించడం వేరు.. ఉపదేశించడం వేరు.. కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాడి వదిలేశారు.. తను ఎన్నికల ప్రచారానికి రానని ఎమ్మెల్యేలకు తేల్చిచెప్పారు. అవసరమనుకుంటే కేటీఆర్ ను బతిమిలాడి మీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయించుకోవచ్చని సూచించారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ సన్నాహక సమావేశం ఆసక్తికరంగా సాగిందట.. ‘మొండిగా వెళితే అడ్రస్ లేకుండా పోతారు.. ఎమ్మెల్యే పదవులు కూడా కోల్పోతారు..’ అంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలను సుతిమెత్తగా హెచ్చరించిన వైనం టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

మామూలుగా కేసీఆర్ డిక్టేటర్ లాగా ఆదేశిస్తాడు.. ఇలా చేయమని హుకూం జారీ చేస్తాడు. ప్రచారానికి తానే వచ్చి స్వయంగా పర్యవేక్షించి గెలుపు బాధ్యతలను తీసుకుంటాడు.. కానీ ఈసారి ట్రెయిన్ రివర్స్ అయ్యింది. కేసీఆర్ ప్రచార బాధ్యతల కాడి వదిలేశారు. మీరే చూసుకోండని మంత్రులు - ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. తేడా వచ్చినా ఒక్కటి ఓడినా పదవులు ఊడుతాయ్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

ముందుండి నడిపించే కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల వేళ మాత్రం కాడి వదిలేసి మీరే చూసుకోవాలని మంత్రులు,ఎమ్మెల్యేలకు పరీక్ష పెట్టారు. కత్తి వేలాడదీశారు. ఓడిపోతే పదవులు పోతాయని హెచ్చరించారు. మరి కేసీఆర్ పెట్టిన పరీక్షలో నెగ్గెదెవరు? ఓడేదెవరు? ఎవరి పదవులు పోతాయన్నది ఆసక్తిగా మారింది.