Begin typing your search above and press return to search.
ఆర్టీసీకి, తెలంగాణకు తేడా ఏంటి కేసీఆర్?
By: Tupaki Desk | 4 Nov 2019 5:04 AM GMTఒకప్పుడు కేసీఆర్ తోపాటు టీఆర్ఎస్ లో వెలుగు వెలిగిన రాములమ్మ తర్వాత గులాబీ బాస్ వైఖరి నచ్చక పార్టీ మారారు. టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో సెటిల్ అయ్యారు. అయితే పాత పగలు మనసులో పెట్టుకొని ఇప్పటికీ కేసీఆర్ పై పగ సాధిస్తున్నారు. సోషల్ మీడియాలో కేసీఆర్ నిర్ణయాలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
తాజాగా విజయశాంతి ఆర్టీసీని కేసీఆర్ సగం ప్రైవేట్ పరం చేయడంపై స్పందించారు. ఘాటు కౌంటర్లు వేశారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ రూట్లను ప్రైవేటు పరం చేస్తున్న కేసీఆర్ గారు, ఆర్థిక కష్టాలకు కారణమైన తెలంగాణ ఆర్థిక శాఖను కూడా ప్రైవేటు పరం చేస్తే బాగుంటుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు. కేసీఆర్ అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాలను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆమె ఆరోపించారు.
ఆర్టీసీ నష్టాలకు కార్మికులను, కార్మిక సంఘాలను బాధ్యులను చేస్తున్న కేసీఆర్, మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మార్చడానికి కారకులు ఎవ్వరూ అని విజయశాంతి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని విశ్లేషకులు తేల్చేశారన్నారు. మిగులు బడ్జెట్ తో మొదలైన తెలంగాణను కేసీఆర్ అప్పల ఊబీలోకి నెట్టాడని విజయశాంతి విమర్శించాడు.
కేసీఆర్ చెబుతున్న ఆర్థిక క్రమశిక్షణ కేవలం ఆర్టీసీకే పరిమితం కాదన్న రాములమ్మ.. ఇది తెలంగాణ ప్రభుత్వానికి వర్తిస్తుందని గుర్తుంచుకోవాలని కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు.