Begin typing your search above and press return to search.

అత్యాధునిక కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్..జాతీయ రాజకీయాల కోసమా..?

By:  Tupaki Desk   |   23 July 2022 1:30 AM GMT
అత్యాధునిక కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్..జాతీయ రాజకీయాల కోసమా..?
X
కేసీఆర్ జాతీయ రాజకీయాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి వరకు టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారుస్తారని అన్నారు. కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకున్నాయి. అయితే తాజాగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో పాలు పంచుకునేందుకు ప్రత్యేకంగా కాన్వాయ్ ని తయారు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గురువారం కొన్ని కార్లు విజయవాడలోని మల్లపల్లి పారిశ్రామిక వాడలోని ఓ గ్యారేజికి వచ్చాయి. ఆ తరువాత తిరిగి కార్గో విమానంలో వెళ్లాయి.

ఈ కార్లు ఓ సంస్థ ప్రత్యేక కార్గో విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చాయి. ఆ తరువాత గ్యారేజికి వెళ్లి కార్లకు కొన్ని ఫిటింగ్ లు చేశారు. తిరిగి వాటిని అదే విమానంలో పంపారు. అయితే వాటిని ఢిల్లీలోని టీఆర్ఎస్ భవనంలో ఉంచుతారని తెలుస్తోంది. కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ఈ కాన్వాయ్ లోనే వివిధ కార్యాలయాలకు వెళుతారని ప్రచారం జరగుతోంది. లేదా ఉత్తరాది పర్యటనలో ఈ కార్లను వినియోగిస్తారని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ కు చెందిన ఈ కార్ల విషయం బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది.

అయితే హైదరాబాద్ ప్రగతి భవనం నుంచి ఈ కార్ల గురించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసమే వీటిని తయారు చేయించాన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అత్యాధునికమైన సాంకేతితో కూడిన ఈ కార్లను కేసీఆర్ ఓ ప్రముఖ సంస్థ నుంచి కొనుగులో చేసినట్లు సమాచారం. ఇప్పటికే కేసీఆర్ రకరకాల కార్లను మార్చారు. ఇప్పుడు కొత్త కాన్వాయ్ ని ఏర్పాటు చేసుకోవడం చూస్తే ఆయన భవిష్యత్ లో ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ముందు తెలంగాణలో అధికారంలోకి వచ్చాక.. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షాలు రోజురోజుకు బలపడుతూ టీఆర్ఎస్ లోపాలను ఎత్తి చూపుతున్నారు. దీంతో ప్రభుత్వంపై మెల్లగా అసంతృప్తి పెరుగుతోంది. ఈ తరుణంలో జాతీయ రాజకీయాలంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అందుకే కేసీఆర్ ప్రస్తుతం సొంత రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక... ఆ వెంటనే జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై నిప్పులు చెరుగుతున్న టీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల వరకు టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చేస్తారని అంటున్నాు. అయితే జాతీయ పార్టీ మారిన తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయనేది చెప్పలేమని కొందరు టీఆర్ఎస్ లో చర్చించుకుంటున్నారు.

ఎందుకంటే ఎన్డీయేను ఢీకొట్టడానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ముందుకు వచ్చే సూచలను కనిపించడం లేదు. టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఇంట్రెస్టు చూపుతున్నా టీఆర్ఎస్ చెప్పిన మాట వినే పొజిషన్లో లేదు. దీంతో టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో ఏ విధంగా సక్సెస్ అవుతారోనని తెలంగాణ ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.