Begin typing your search above and press return to search.
జ్వరంతో సారు సతీమణి.. ఆసుపత్రికి
By: Tupaki Desk | 20 Jan 2015 10:53 AM GMTతెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్న వారికి ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టిన కేసీఆర్.. ఒక అంశాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోవటం లేదు. తాజాగా చోటు చేసుకున్న పరిణామంతో అయినా ఆయన మేలుకుంటారో లేదో చూడాలి.
తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ జ్వరంగా బాధపడుతున్నారు. ఆమెను చికిత్స నిమిత్తం యశోదాఆసుపత్రిలో చేర్పించారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో ఆమె జ్వరగానికి గురై ఉంటారని చెబుతున్నారు.
కొద్ది రోజుల క్రితమే జ్వరం(కొందరు స్వైన్‌ఫ్లూ అని కూడా చెప్పారు) కారణంగా కేసీఆర్ కుమార్తె.. ఎంపీ కవిత ఆసుపత్రిలో చికిత్స పొందటం తెలిసిందే. కొద్దిరోజులు ఆసుపత్రిలో చిక్సిత పొందిన ఆమె.. కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మొన్న కుమార్తె.. నేడు సతీమణి జ్వరానికి గురి కావటం గమనార్హం. గత కొద్దిరోజులుగా తెలంగాణలో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉందని.. స్వైన్‌ఫ్లూ కేసులు ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు రావటం తెలిసిందే. తాజా నేపథ్యంలోనైనా తెలంగాణలోని ఆరోగ్య పరిస్థితులపై సారు దృష్టి పెడితే బాగుంటుందేమో.