Begin typing your search above and press return to search.
తెలంగాణ అడిగినవి ఇవ్వకుంటే దేశం నుంచి తరిమికొట్టుడా కేసీఆర్?
By: Tupaki Desk | 12 Feb 2022 4:49 AM GMTఫస్ట్రేషన్ లో ఉండే వారితో వచ్చే చిక్కు ఇలానే ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సావధానంగా ఆలోచించే వీలు ఉంటుంది. అందరికి మేలు చేసే అంశాల గురించి ఆలోచించుకునే అవకాశం ఉంటుంది.
అందుకు భిన్నంగా మనసులో కత్తులు నూరుకుంటూ.. ఏదో ఒకటి చేయాలన్న పట్టుదలతో ఉండటం తప్పేం కాదు. కానీ.. ఒక దేశ ప్రధానిగా ఉన్న అధినేతను ఉద్దేశించి.. దేశం నుంచి తరిమి తరమి కొడతామని చెప్పటంలో అర్థంఉందా? అన్నది ప్రశ్న. ఏం నేరం చేశారని దేశం నుంచి మోడీని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది?
అలా అని ప్రధానిగా వ్యవహరిస్తున్న మోడీ తప్పులు చేయలేదని మేం చెప్పట్లేదు. ఇప్పుడు ఇన్ని మాటలు అంటున్న కసీఆరే.. ఒకప్పుడు ప్రధానమంత్రిని ఎంత గొప్పగా అభివర్ణించటం.. ఆయన తీసుకున్న నిర్ణయాలు మరెంత బాగా ఉన్నాయన్న విషయాన్ని ఉదాహరణలతో వర్ణించటం తెలిసిందే.
అలాంటి పెద్ద మనిషి ఈ రోజున ఏకాఏకిన దేశం నుంచి తరిమి కొడతామన్న పెద్ద మాట ఆయన నోటి నుంచి ఆసువుగా వచ్చేయటం చూస్తే.. అటు మునగ చెట్టు ఎక్కించాలన్నా.. ఇటు పాతాళంలోకి తొక్కేయాలన్నా.. కేసీఆర్ కు మించినోళ్లు మరెవరూ ఉండరని చెప్పాలి.
దేశ ప్రధానిగా వ్యవహరించే వ్యక్తిని స్వేచ్ఛగా.. స్వతంత్య్రంగా వ్యవహరించాలని కోరుకుంటారు ఎవరైనా. అందుకు భిన్నంగా తమనదైన ప్రపంచంలో.. తాము కోరుకుంటున్నట్లుగా ప్రధాని ఉండాలనుకోవటం అత్యాశే అవుతుందని చెప్పాలి.
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. రాజకీయ వైరం మొదలైతే వారిని. దేశం నుంచి తరిమికొట్టేంత వరకు గొడవ ముదరటం ఏ మాత్రం మంచిది కాదు. మిగిలిన విషయాల్లో ఉండే రాజకీయ విభేదాలను పట్టుకొని దేశ ప్రధానమంత్రిని ఉద్దేశించి.. ‘దేశం నుంచి తరిమికొడతాం’ లాంటి తీవ్ర వ్యాఖ్యలు రానున్న రోజుల్లో రాజకీయాలు ఏ రీతిలో ఉండనున్నాయన్న విషయాన్ని కేసీఆర్ తన తాజా వ్యాఖ్యలతో స్పష్టం చేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.