Begin typing your search above and press return to search.
కేసీఆర్ కలను సాకారం చేస్తున్న తమిళుడు ఎవరంటే...
By: Tupaki Desk | 19 Jun 2019 7:32 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మనసును...ఓ తమిళుడు గ్రహించాడు. ఆయన ఆకాంక్షకు తగిన రీతిలో...ఓ అద్భుతమైన డిజైన్ అందించాడు. కేసీఆర్ కలగంటున్న నూతన సెక్రటేరియట్, అసెంబ్లీ నిర్మాణానికి ఆయన ఓవైపు సన్నద్ధమవుతుండగా, మరోవైపు కేసీఆర్ ఆలోచనలను గ్రహించిన ఓ తమిళ తంబి ఆ నిర్మాణానికి ఏకంగా ఓ డిజైన్ ఖరారు చేసేశాడు! ఈ విషయాన్ని స్వయంగా కేసీఆరే వెల్లడించారు. శాసనసభకు కొత్త భవనాన్ని నిర్మించాలని మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. పార్లమెంట్ భవనాన్ని పోలిన విధంగా అసెంబ్లీ నిర్మాణం ఉండాలని మంత్రిమండలి సమావేశం తీర్మానించింది.
హైదరాబాద్ నడిబొడ్డున గల ఎర్రమంజిల్ లోని ఎత్తయిన ప్రాంతంలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించనున్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న స్థలంలోనే సచివాలయం కొత్త భవనాన్ని కూడా నిర్మిస్తారు. ఈ రెండు భవనాలకు ఈ నెల 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. మంత్రిమండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ``ఎర్రమంజిల్ లో ఎలివేటెడ్ తరహాలో ఉన్న 17ఎకరాల భవనంలో కొత్త అసెంబ్లీ కడతాం. ఇప్పుడున్న అసెంబ్లీ భవనం హెరిటేజ్ బిల్డింగ్ లా ఉంటుంది. దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతమున్న అసెంబ్లీ ఫ్రంట్ ఎలివేషన్ తరహాలోనే కొత్త అసెంబ్లీ భవనం ఎలివేషన్ ఉంటుంది. ఇక సెక్రటేరియట్ లో కొన్ని 50, 60 ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగులున్నాయి. ఆ తర్వాత కట్టినవీ ఉన్నాయ్. అందుకే, మొత్తం కూల్చి కట్టాలా? లేక కొన్ని అలాగే ఉంచి వాడుకోవాలా? అనే విషయాన్ని నిర్ణయిస్తాం. మనం సెక్రటేరియట్ కడుతున్నామని తెలుసుకొని దేశవ్యాప్తంగా ఆర్కిటెక్టులు డిజైన్లు పంపిస్తున్నారు. వాటిలో ఒకటి ఇదిగో ఇలా ఒక తమిళ ఆర్కిటెక్ట్ పంపించారు. బిల్డింగ్ ఆల్ మోస్ట్ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది? ఒకటే భవనం అటూఇటూగా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ముందంతా ఖాళీగా ఉంటుంది. అతిపెద్ద లాన్లు, అద్భుతమైన ఫౌంటెయిన్లు ఉంటాయి. హఫీజ్ కాంట్రాక్టర్ కూడా మంచి డిజైన్ పంపించాడు.`` అని వెల్లడించారు.
ఇప్పటికే రెండు, మూడు డిజైన్లు వచ్చాయని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు .``సెక్రటేరియట్ కు భూమి పూజ మాత్రం ఈ 27 నాడు చేస్తాం. ఆ తర్వాత దసరా రోజు వరకూ మంచి రోజుల్లేవు. పూజ చేసుకుంటే ఏ టైమ్ లో అంటే ఆ టైమ్ లో తీసుకోవచ్చు. ఈలోపు ఆర్ అండ్ బీ మంత్రి అధ్యక్షతన, ముగ్గురు సభ్యులతో కలిపి ఒక ఉపసంఘం వేస్తాం. మొత్తం కూలగొట్టి కట్టాలా? లేక కొన్ని ఉంచుకుని, ఇంటిగ్రేట్ చేసుకుని కట్టాలా? అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. దీనివల్ల పని కూడా ఫాస్ట్ గా జరుగుతుంది. మొత్తం సెక్రటేరియట్ ను తరలించాలా? లేక పాక్షికంగానా? అనేది క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడుతుంది అని సీఎం కేసీఆర్ తెలిపారు.