Begin typing your search above and press return to search.
నిజామాబాద్ సభలో కేసీఆర్ తిట్లు ఇవే!
By: Tupaki Desk | 4 Oct 2018 5:10 AM GMTప్రత్యర్థిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయాలి. అవి కాస్తా పతాకా శీర్షికల్లోకి ఎక్కాలి. మాట్లాడిన ప్రతి మాటా పక్కరోజు పేపర్లో ప్రముఖంగా కనిపించాలన్న విషయంలో కేసీఆర్ టాలెంటే టాలెంట్. ఆపద్దర్మ ముఖ్యమంత్రి హోదాలో తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి ఉలిక్కిపడేలా చేశాయని చెప్పాలి.
తిట్లదండకంలో తనకు మించినోళ్లు ఉండరన్న విషయాన్ని కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసినా.. తాజాగా ఆయన తన తిట్లను మరో స్థాయికి తీసుకెళ్లారనే చెప్పాలి. కోపంతో విచక్షణ మరిచిన క్షణంలో.. రోడ్ల మీద తిట్టుకునే తరహాలో కేసీఆర్ కూడా తాజాగా తిట్టేశారు. ఢిల్లీకి.. అమరావతికి గులాములు చేస్తున్నారు థూ.. మీ బతుకులు చెడ అంటూ కేసీఆర్ విరుచుకుపడిన వైనం చూసినప్పుడు.. ఇదే కేసీఆర్ చంద్రబాబును వాటేసుకొని.. నవ్వేసుకుంటూ మాట్లాడుకున్న వైనం చప్పున గుర్తుకు రాక మానదు.
అవసరానికి వాటేసుకుంటాం.. రాజకీయ అవసరం కోసం తిట్టేస్తామన్నట్లుగా కేసీఆర్ తీరు ఉండటాన్ని అర్థం చేసుకోవాలే కానీ అపార్థంచేసుకోవాలి. ఏది ఏమైనా.. తాను తీసుకొచ్చిన ముందస్తు ఎన్నికల్లో మస్తు మెజార్టీతో గెలవాలి. అందుకు ఏం చేయటానికైనా సిద్ధమన్న విషయాన్ని కేసీఆర్ తాజాగా తన మాటల్లో చెప్పేశారని చెప్పాలి.
తెలంగాణ ప్రజల భావోద్వేగ కీ ఎక్కడ ఉందన్న విషయం కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదన్నది మర్చిపోకూడదు. ఉద్యమాన్ని పీక్స్ కు తీసుకెళ్లేందుకు తన అవసరానికి తగ్గట్లుగా కీ ఇస్తూ నడిపించిన ఉద్యమ నేత.. రాజకీయ నేతగా మారి.. అధికారాన్ని హస్తగతం చేసుకున్న వైనాన్ని మర్చిపోకూడదు. ఆటలో గెలుపు మజాను ఒకసారి అస్వాదించిన తర్వాత అంత తేలిగ్గా గెలుపును దూరం చేసుకోవటానికి ఇష్టపడరు. అందుకు కేసీఆర్ సైతం మినహాయింపు కాదన్నది మర్చిపోకూడదు.
119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీలో 100 సీట్లు తన ఖాతాలోకి.. మరో ఏడు సీట్లు తన స్నేహితుడు మజ్లిస్ ఓవైసీకి రావాలని.. మిగిలిన 12 సీట్లలో తన రహస్య స్నేహితుడికి కోటా అయిన ఆరు సీట్లు పోనూ.. మిగిలిన ఆరు సీట్లకే కాంగ్రెస్ పరిమితం కావాలని కేసీఆర్ సారు డిసైడ్ అయిన తర్వాత.. అందుకు భిన్నంగా జరిగితే ఆయనకెంత కోపం వస్తుంది? తాను సాధించిన తెచ్చిన తెలంగాణలో తాను డిసైడ్ చేసిందే జరగాలె కానీ.. అందుకు భిన్నంగా ఏం జరిగినా.. అది ఆంధ్రోళ్ల కుట్రే అవుతుంది తప్పించి మరింకేమీ కాదన్నది మర్చిపోకూడదు.
ఈ కారణంతోనే కేసీఆర్ కు తన రాజకీయ ప్రత్యర్థుల పైన కోపం వచ్చింది. చూస్తూ.. చూస్తూ.. తెలంగాణ వస్తే తొలి సీఎం దళితుడే అవుతాడని.. లేకుంటే తన మెడ మీద తల ఉండదన్న శపధాన్ని గుర్తు చేసుకోలేరుగా? అంతేనా.. ఎన్నికల నాటికి తెలంగాణ మొత్తంగా ఇళ్లల్లో నల్లా ట్యాపులు తిప్పితే.. నీళ్లు ఉరికి పడాలె. అప్పుడు మాత్రమే ఓట్లు అడుగుతానన్న పెద్దమనిషి.. ఇప్పుడు ఓట్లు ఎందుకు అడుగుతుండన్న క్వశ్చన్ కు కేసీఆర్ ఆన్సర్ చెప్పలేరు కదా? అందుకే.. ప్రశ్నించే అలవాటున్న ప్రజలకు.. తాము ప్రశ్నించే అలవాటును మర్చిపోయేలా చేయాలంటే మతి పోయేలా మాటలు ఉండాలి.
ప్రశ్నలు సంధించాలనుకునే వారు సైతం షాక్ తినాలి. అందుకు.. మసాలా దట్టించినట్లుగా మాటలు ఉండాలి. అందుకే తాజాగా తిట్ల దండక స్వరూపాన్ని మార్చేశారు కేసీఆర్. నిజామాబాద్ సభలో కేసీఆర్ దట్టించి వదిలిన తిట్ల తూటాల్ని కాస్త చూస్తే.. ఆయన ఆగ్రహం ఎంతన్నది ఇట్టే అర్థమైపోతుంది.
+ చట్ట ప్రకారం తెలంగాణకు రావాల్సిన కరెంటు ఇవ్వకుండా ఇక్కడి ప్రజలు గోస పడుతుంటే రాక్షసానందం పొందారు
+ తెలంగాణ నుంచి 7 మండలాలను, సీలేరు పవర్ ప్లాంటును బలవంతంగా గుంజుకున్నారు. అలాంటి నేతతో పొత్తు పెట్టుకుంటూ కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. ‘‘ఢిల్లీకి, అమరావతికి గులాములు చేస్తున్నారు. థూ... మీ బతుకులు చెడ’’
+ ‘‘సిగ్గు లేకుండా.. ‘మేం చంద్రబాబునాయుడుతోని పొత్తుగలుస్తం’.. థూ, మీ బతుకులు చెడ. మీవో బతుకులా? ఎవ్వడైతే తెలంగాణను నాశనం చేసిండో, ఎవడైతే గుండు గొట్టిండో, నిర్దాక్షిణ్యంగ ఎన్‌కౌంటర్ల పేరు మీద ఎవ్వడైతే వందల మంది తెలంగాణ బిడ్డలను బలిపెట్టుకున్నడో తెలంగాణ ద్రోహి.. చెడిపోయి చంద్రబాబునాయుడితోని పొత్తా, మీ బతుకులకు? ఏమయా అడుక్కుంటే మేమిస్తమయ్యా నాలుగు సీట్లు గావాలంటే.. ఇదా మీ బతుకు?’’
+ ‘‘దయచేసి తెలంగాణ మేధావులకు - తెలంగాణ పెద్దలకందరికీ నేను మనవి జేస్తా ఉన్నా. సిగ్గు పోదండీ..? నవ్వేటోని ముందర జారిపడతమా? మళ్ల ఆంధ్రులకప్పగిస్తరా అధికారం? పద్నాలుగేండ్లు పోరాటం జేసి ప్రాణాలకు తెగించి నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో నేను చావు నోట్ల దాకా పోయి కొట్లాడి తెచ్చిన తెలంగాణం.. మళ్లీ ఇయ్యాల విజయవాడకు, అమరావతికి పోవాల్నా మనం? యాడికి పోవాల? మీ గులాం మనస్తత్వానికి - మీ చిల్లర అధికారానికి ఇంత నీచంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతరా?
+ ఈరోజు.. దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడితో పొత్తా? ఇంతకన్నా అధ్వానముంటదా? ఇంతకన్నా దిగజారుడుంటదా? ఇంకా సిగ్గుపోయే మాట.
+ సిగ్గుపోతది చెప్తే నిజంగ.. బాధపడుతున్న నేను.. ఇంత పౌరుషం చూపించిన గడ్డ.. ఇన్ని వందల మంది చచ్చిపోయి సాధించిన తెలంగాణ గడ్డ.. చంద్రబాబునాయుడు ఇప్పుడు 500 కోట్లు ఇస్తాడంట ఈ దుర్మార్గులకు.. కాంగ్రెస్ ప్రచారానికి 3 హెలికాప్టర్లు చంద్రబాబునాయుడు బుక్‌జేసి వీళ్లకిస్తడట.
+ వీళ్లు వాని కాళ్లొత్తి దండంబెట్టి వాన్ని ఊరేగించి మళ్ల తెస్తరట. మన నెత్తిన పెడతరట. ఇదేనా కావాల్సింది తెలంగాణకు మనం కోరుకున్నది ఇదేనా? పోరాటం జేసింది ఇందుకేనా? ఇంతమంది చచ్చిపోయింది ఇందుకేనా? ఏడు మండలాలు గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబునాయుడు.
+ తెలంగాణకు కరెంటు లేకపోతే.. యాక్ట్ పాసైతే.. దాన్ని ఉల్లంఘించి మనకు కరెంటియ్యక.. మనం కరెంటు కోసం గోస పడ్డనాడు రాక్షసానందం పొందిన రాక్షసి చంద్రబాబునాయుడు.
+ చంద్రబాబునాయుడితోని పోత్తా? సిగ్గూశరం కూడా ఉండాలె. ఈ రోజు సీలేరు పవర్ ప్రాజెక్టును గుంజుకున్నోడు చంద్రబాబునాయుడు. ఆ దుర్మార్గునితోనా మీరు పొత్తుగల్సేది? ఓటుకు నోటు కేసులో దొరికిన అడ్డమైన దొంగ, నిలువున దొరికిన దొంగ కాదా?
+ ఇయ్యాల కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దాచిదాచి దయ్యాలకప్పగించినట్లు ఇయ్యాల చంద్రబాబునాయుడుకు అప్పగిద్దామా?
+ ఉత్తమ్ బట్టేబాజ్ అంటాడా? సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని అలా తిట్టొచ్చా? నా నోరు కూడా చెడ్డదే అని నోరు తెరిచానంటే తెల్లారే వరకు తిట్టగలను
+ ‘‘తెలంగాణ నేను తేకపోతే నీయబ్బ తెచ్చాడా?’’ ఏదో ఒక రాయి వేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు సొల్లు కబుర్లు చెబుతున్నారు
+ రాష్ట్రంలో బీజేపీ నేతలు ఇంటి కిరాయి ఇస్తామని, చెంబట్కపోతే వాసన రాకుండా చేస్తామని అంటున్నారు. అధికారంలోకి రాగానే నల్లధనం తీసుకువస్తానని ప్రధాని మోదీ - అమిత్ షా ప్రకటించారు. ప్రతీ కుటుంబానికి 15 లక్షలు ఖాతాలో వేస్తామన్నారు. వారు ప్రతీ కుటుంబానికి ఖాతాలో 15 లక్షలు వేస్తే నేనే ఇంటి కిరాయి కడతా.