Begin typing your search above and press return to search.
ఢిల్లీలో కేసీఆర్...మంత్రివర్గ విస్తరణకు కసరత్తు
By: Tupaki Desk | 26 Dec 2018 6:12 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీలో మకాం వేశారు. దేశవ్యాప్తంగా పర్యటించి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని - ఇప్పటికే పలు రాష్ట్ర సీఎంలతో కేసీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్ కతా నుంచి ముఖ్యమంత్రి సోమవారం రాత్రి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. తుగ్లగ్ రోడ్డులోని తన నివాసంలో మంగళవారం రాష్ట్ర ఎంపీలతో సమాలోచనలు జరిపినట్టు తెలిసింది. కాంగ్రెస్ - బీజేపీయేతర పార్టీల అధినేతలు ఎవరెవరూ ఢిల్లీలో ఉన్నారన్న సమాచారం తన ఎంపీలతో కేసీఆర్ తెలుసుకుంటున్నారు. అందుబాటులో ఉన్న నాయకులతో సమావేశం కావాలని సీఎం యోచిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీకి రావడంతో... ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
మూడు రోజులపాటు ఢిల్లీలోనే బస చేయనున్న కేసీఆర్ 28 లేదా 29వ తేదీన హైదరాబాద్ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే 30 లేదా 31న మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయని తెరాస వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండోసారి ముఖ్యమంత్రిగా ఈ నెల 13న రాజ్ భవన్ ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ తనతో పాటు మహమూద్ అలీని మంత్రివర్గంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు హోంమంత్రి శాఖను కేటాయిస్తూ అదేరోజు సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆనాటి నుంచి మంత్రివర్గ విస్తరణపై ఆశావహులు గంపెడాశలు పెట్టుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యులు - మాజీ మంత్రులు - ఎమ్మెల్సీలు నేరుగా సీఎం కేసీఆర్ ను కలిసి ఎన్నికల్లో విజయం సాధించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూనే మంత్రివర్గంలో తమకు చోటు కల్పించాలని అభ్యర్థించిన సంగతి తెలిసిందే.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన వారెవరు, గతంలో మంత్రులుగా పనిచేసిన వారి పనితీరు ఎలా ఉంది, ఆయా జిల్లాల్లో పార్టీ పటిష్టతకు ఎమ్మెల్యేలు - మంత్రులు - ఎమ్మెల్సీలు చేసిన కృషి ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకుని వారినే మంత్రివర్గంలోకి చేర్చుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మాజీలైన మంత్రుల్లో తిరిగి ఎవరెవరికి అవకాశం దక్కుతుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతుంటే, కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో కొందరు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఢిల్లి నుంచి తిరిగి వచ్చిన వెంటనే కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరిస్తారని - ఇందుకు సంబంధించి ఆయన హస్తినలో సమాలోచనలు జరుపుతున్నారని సమాచారం బయటకు పొక్కడంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు లాబీయింగ్ చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. విదేశీ పర్యటనకు వెళ్ళిన కేటీఆర్ గురువారం నగరానికి చేరుకుంటారని ఆయన కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.