Begin typing your search above and press return to search.
కేసీఆర్ కేబినెట్: ఇన్ ఎవరు? ఔట్ ఎవరు?
By: Tupaki Desk | 27 Aug 2019 7:26 AM GMTమొత్తానికి దసరాకు కేసీఆర్ కేబినెట్ విస్తరణ చేయబోతున్నారని కన్ఫం అయ్యింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రుల పనితీరును బేరీజు వేసుకొని ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులను తొలగించి మొత్తం 8 లేదా 9 మందిని కొత్తవారిని కేబినెట్ లోకి కేసీఆర్ తీసుకోబోతున్నారనే చర్చ ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది.
ముఖ్యంగా ఇప్పుడు ఇద్దరు మంత్రులకు కత్తి వేలాడుతోందని గులాబీ పార్టీలో చర్చించుకుంటున్నారు. ఇటీవల కలెక్టర్ల సమీక్షలో జరిగిన విషయాలను కేసీఆర్ బయటపెట్టవద్దని సూచించినా రెవెన్యూ సంఘాలతో లీక్ చేసిన మంత్రికి ఈసారి ఉద్వాసన తప్పదన్న చర్చ పార్టీలో సాగుతోంది.
ఇక నమ్మి పార్టీలోకి వచ్చిన మహిళా ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వడం కోసం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన మంత్రికే కేసీఆర్ ఎసరు పెడుతున్నారనే చర్చ పార్టీలో సాగుతోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టి 9 నెలలైనా ఆయన జిల్లాపై పట్టు సాధించకపోవడంతో కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఇక అందరూ డిమాండ్ చేస్తున్నట్టు కేటీఆర్ - హరీష్ లతోపాటు వరంగల్ జిల్లా నుంచి మరొకరికి మంత్రి పదవి, మహిళా కోటాలో ఇద్దరికీ - ఎస్టీ కోటా నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు ఖాయమన్న ప్రచారం సాగుతోంది. మరి కేసీఆర్ దసరాకు ఏం చేయబోతున్నారన్నది వేచి చూడాలి.