Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు ప‌రీక్ష‌గా మారిన 90 నియోజ‌క‌వ‌ర్గాలు

By:  Tupaki Desk   |   10 Jan 2018 9:09 AM GMT
కేసీఆర్‌ కు ప‌రీక్ష‌గా మారిన 90 నియోజ‌క‌వ‌ర్గాలు
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. పోల్ మేనేజ్ మెంట్లో అత్యుత్త‌మ వ్యూహాలు ప‌న్నే ముఖ్య‌నేత‌ల్లో కేసీఆర్ ఒక‌రు. నిజానికి ఎన్నిక‌ల‌తో తెలంగాణ ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్లార‌ని చెప్పాలి. ఎప్ప‌టిక‌ప్పుడు ఉప ఎన్నిక‌లు వ‌చ్చేలా చేసి తెలంగాణ ఉద్య‌మాన్ని లైవ్ లో ఉంచ‌ట‌మే కాదు.. స‌ద‌రు ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైతే.. తెలంగాణ ఉద్య‌మం ఫెయిల్ అయిన‌ట్లేన‌న్న భావ‌న క‌లుగ‌జేయ‌టంలో ఆయ‌న స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి.

తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘ‌కాలంగా ఉద్య‌మం జ‌రిగిన‌ప్ప‌టికీ.. సాధ‌న‌లో కీల‌క భూమిక పోషించిన మ‌లిద‌శ‌లో ఉప ఎన్నిక‌లు ప్లే చేసిన వైనం ఎంత‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయంటేనే.. దానికి అర్నెల్ల ముందు నుంచే క‌స‌ర‌త్తు చేయ‌టంతో పాటు.. ఎన్నిక‌ల వేళ‌కు ఎలాంటి నినాదాన్ని తెర మీద‌కు తీసుకురావాల‌నే అంశంపైనా కేసీఆర్‌ కు క్లారిటీ ఎక్కువ‌నే చెప్పాలి.

మ‌రో ఏడాది వ్య‌వ‌ధిలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ‌.. గెలుపు గుర్రాల్ని డిసైడ్ చేసే ప్ర‌క్రియ ఇప్ప‌టికే త‌ల‌మున‌క‌లైన సీఎం కేసీఆర్ ఇప్ప‌టికే కొన్ని లెక్క‌ల్ని సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. టికెట్లు ఫైన‌ల్ చేయ‌టానికి ముందస్తు క‌స‌ర‌త్తులో భాగంగా.. టికెట్ల పంపిణీని మూడు విధాలుగా విభ‌జించినట్లు తెలుస్తోంది.

మొద‌టి విధానంలో ప‌క్కాగా టికెట్లు ఇవ్వాల్సిన వారు.. స‌ద‌రు నేత‌లు ప్రాతినిధ్యం వ‌హించే నియోజ‌క‌వ‌ర్గాలుగా చెప్పాలి. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మంత్రులు కేటీఆర్.. హ‌రీశ్ రావుతో పాటు.. ఈటెల‌.. క‌డియం లాంటి వాళ్లు ఉండ‌నున్నారు. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాలు మొత్తం 28 ఉన్న‌ట్లుగా తేలింది. ఇక‌.. ఇద్ద‌రేసి బ‌ల‌మైన అభ్య‌ర్థులు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలుగా 70 ఉన్న‌ట్లు గుర్తించగా.. ముగ్గురేసి అభ్య‌ర్థులు టికెట్లు పోటీ ప‌డుతున్న నియోజ‌క‌వ‌ర్గాలు 20 ఉన్న‌ట్లుగా తేలింది.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా..ఈసారి తొంభై నుంచి తొంభై ఐదు స్థానాల‌కు టీఆర్ఎస్ టార్గెట్ చేయ‌టం తెలిసిందే. ఈసారి క్లీన్ స్వీప్ చేయాల‌ని భావిస్తున్న కేసీఆర్‌.. ఎన్నిక‌ల వ్యూహాన్ని పక్కాగా ర‌చిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఇప్ప‌టికే నిఘా వ‌ర్గాలు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పోటీ ప‌డుతున్న అభ్య‌ర్థుల బ‌లాబ‌లాల మీద నివేదిక ఇచ్చార‌ని.. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా సెకండ్ ఓపినీయిన్ కూడా తెప్పించిన‌ట్లుగా చెబుతున్నారు. గ‌డిచిన మూడేళ్ల‌లో ఇప్ప‌టికి ప‌ది సార్లు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌ర్వేలు జ‌రిపారు.

వీటి ఫ‌లితాల్ని ఒక్క‌టిగా చేసి అంతిమంగా అభ్య‌ర్థుల్ని సిద్ధం చేయాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. చివ‌రి క్ష‌ణం ఎంపిక‌లు.. అసంతృప్తులు. అల‌క‌లు.. బుజ్జ‌గింపులు లేకుండా చూసుకునేందుకు తొమ్మిది నెల‌ల‌కు ముందే అభ్య‌ర్థుల్ని క‌న్ఫ‌ర్మ్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.మిగిలిన రాజ‌కీయ పార్టీలకు భిన్నంగా.. ఆఖ‌రి క్ష‌ణంలో పందెం కోళ్ల‌ను ఎంపిక చేసుకునే క‌న్నా..ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల ముందే ప్ర‌క‌టించి.. గెలుపు గుర్రాలుగా త‌యారు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. మ‌రి.. ఆలోచ‌న‌లు ఎన్ని ఉన్నా అంతిమంతా తాము అనుకున్న‌ది కేసీఆర్ ఎంత‌వ‌ర‌కు అమ‌లు చేస్తార‌న్ని కాల‌మే డిసైడ్ చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.