Begin typing your search above and press return to search.
ఈ ముగ్గురూ ఔట్!...ఆ ఐదుగురు ఇన్!
By: Tupaki Desk | 18 Feb 2019 11:11 AM GMTతెలంగాణలో కేబినెట్ విస్తరణకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నా... గులాబీ దళపతి - తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఇంకా గుంభనంగానే వ్యవహరిస్తున్నారు. ఈ నెల 19న ఉదయం 11.30 గంటలకు కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయినా... ఈ విస్తరణలో ఎవరెవరికి స్థానం కల్పిస్తామన్న విషయాన్ని మాత్రం టీఆర్ ఎస్ బయటపెట్టడం లేదు. గత మంత్రివర్గంలో ఉన్న చాలా మందికి హ్యాండివ్వనున్న కేసీఆర్... తనకు అనుంగులుగా ముద్రపడిన వారిలో చాలా మందికే స్థానం కల్పిస్తున్నారన్న వార్తలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. ఈ కూర్పుపై టీఆర్ ఎస్ నేతలు పెదవి విప్పకున్నా... టీఆర్ ఎస్ అనుకూల మీడియాలో వచ్చిన కథనాల మేరకు ఈ విస్తరణలో ఎంతమందికి చోటు దక్కనుంది? ఎవరెవరికి చోటు దక్కనుంది? అన్న అంశాలపై ఫుల్ క్లారిటీ వచ్చినట్లుగానే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటిదాకా వినిపించిన వార్తల మాదిరే... ఈ దఫా కేబినెట్ విస్తరణలో కేసీఆర్ తన అల్లుడు తన్నీరు హరీశ్ రావుకు గానీ - కొడుకు కేటీఆర్ కు గానీ తన కేబినెట్ లో స్థానం కల్పించడం లేదట. ఇక తనకు అత్యంత సన్నిహితుడిగా - గత మంత్రివర్గంలో సత్తా చాటి మంచి మార్కులు వేయించుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు కూడా ఈ దఫా కేబినెట్ లో చోటు దక్కడం లేదట. ఈ ముగ్గురికి హ్యాండివ్వనున్న కేసీఆర్... కొత్తగా ఐదుగురికి ఛాన్స్ ఇవ్వనున్నారట. ఈ ఐదుగురిలో ఏకంగా నలుగురికి కూడా కేసీఆర్ కు వీర విధేయులన్న పేరుంది. వీరిలో కరీంనగర్ జిల్లా నుంచి కొప్పుల ఈశ్వర్ - మహబూబ్ నగర్ జిల్లా నుంచి నిరంజన్ రెడ్డి - శ్రీనివాస్ గౌడ్ - నిజామాబాద్ జిల్లా నుంచి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఇక కొత్తగా మంత్రి పదవి దక్కే నేతగా వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు వినిపిస్తోంది.
ఈ ఐదుగురితో పాగు గత కేబినెట్ లో మంత్రులుగా ఉన్న అల్లోల ఇద్రకరణ్ రెడ్డి (ఆదిలాబాద్ జిల్లా) - జగదీష్ రెడ్డి (నల్గొండ జిల్లా) - తలసాని శ్రీనివాస్ యాదవ్ (హైదరాబాద్ జిల్లా)లున్నారు. మొత్తంగా ఈ విస్తరణలో ఈ 8 మందితో పాటు మరొకరికి మొత్తంగా 9 మందికి చోటు కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఓ మరొకరు ఎవరన్న విషయంపై కేసీఆర్ ఇంకా నిర్ధారించలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కేసీఆర్ కు మరో ముఖ్య అనుచరుడిగా ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన దాస్యం వినయ్ భాస్కర్ ను ఈ దఫా చీఫ్ విప్ గా - మాజీ మంత్రి పద్మారావును డిప్యూటీ స్పీకర్ గా నియమితులు కానున్నారని తెలుస్తోంది. ఎస్సీ కోటా నుంచి కొప్పుల ఈశ్వర్ ను ఎంపిక చేసిన కేసీఆర్.. మహిళా కోటా నుంచి కూడా ఒకరిని ఎంపిక చేయాలని యోచిస్తున్నారట. అయితే ఈ మహిళా మంత్రి ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదని - విస్తరణ ముహూర్తంలోగా కేసీఆర్ దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారన్న వాదన వినిపిస్తోంది.