Begin typing your search above and press return to search.
లెక్కలు సరిచూసుకుంటున్న కేసీఆర్
By: Tupaki Desk | 2 Nov 2016 4:09 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన రెండున్నరేళ్ల తర్వాత పార్టీపై దృష్టి పెట్టిన నేపథ్యంలో అన్నీ సమీకరణాలు, లెక్కలు పరిగణనలోకి తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కేసీఆర్ సారథ్యంలో గత పక్షం రోజులుగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి కొత్త జిల్లా కమిటీలు - రాష్ట్ర కమిటీ - పొలిట్ బ్యూరో - అనుబంధ కమిటీల ఎంపిక కొలిక్కి వచ్చిందని సమాచారం. దాదాపు 90శాతం వరకు నాయకుల ఎంపిక పూర్తయినట్లు చెప్తున్నారు. పెద్ద జిల్లాలకు 24 మందితో - చిన్ని జిల్లాలకు 15 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా ఈ కమిటీల ద్వారా మూడున్నర వేల మందికిపైగా నాయకులకు పార్టీ పదవులను ఇవ్వనున్నారు.
పార్టీ పుట్టిననాటి నుంచి ఏమీ ఆశించకుండా పనిచేసినవారికి అవకాశాలిస్తూనే - భవిష్యత్తులో పార్టీ అవసరాలను తీర్చే యువతకు కేసీఆర్ పెద్దపీట వేసినట్లు సమాచారం. అదే సమయంలో సామాజిక వర్గాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తంగా 10 జిల్లాల టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్ష పగ్గాలను బీసీ నేతలకు ఇవ్వబోతున్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీసీల పట్ల వైఖరిలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేయడమే ఉద్దేశంగా కార్యాచరణ సాగుతున్నట్లు సమాచారం. బీసీల్లో కూడా పార్టీ పుట్టిన నాటి నుంచి నిస్వార్థంగా సేవలందించినవారికి - ఉద్యమ సమయంలో క్రియాశీలంగా వ్యవహరించినవారికి అవకాశాలు దక్కనున్నట్లు తెలుస్తున్నది. పది మంది బీసీ నేతలకు జిల్లా పగ్గాలిస్తుండటం పట్ల పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ముగ్గురు మైనారిటీలకు కూడా జిల్లా బాధ్యతలివ్వనున్నారని సమాచారం. ఎస్సీలకు మూడు జిల్లాలు - ఎస్టీలకు రెండు జిల్లాల చొప్పున పార్టీ నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తున్నారు. జిల్లాల సామాజిక పరిస్థితులనుబట్టి పార్టీ నిర్మాణం బలంగా ఉండేలా కొత్త కమిటీలకు రూపకల్పన చేసినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే అన్ని మార్గాల ద్వారా అందిన నివేదికలను బట్టి నేతల ఎంపిక పూర్తయింది. చివరిదశలో ఉన్న కమిటీలను బుధవారం నాటికి పూర్తిచేయాలని అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/