Begin typing your search above and press return to search.
ఢిల్లీలో కూడా అదే పనా కేసీఆర్ సాబ్?
By: Tupaki Desk | 28 Jun 2017 6:06 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. అధికారిక - వ్యక్తిగత వ్యవహారాలపై ఢిల్లీ వెళ్ళిన సీఎం కేసీఆర్ పార్టీ వ్యవహారాలపైనా దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఇటు పార్టీ వ్యవహారాలు - పదవుల భర్తీపైనా చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు మెజార్టీ కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు భర్తీ చేసిన ఆయన పటిష్టమైన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటుకు హస్తినలో ఉండి ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. హైదరాబాద్ లో ఉంటే పార్టీ పదవుల కోసం తనను కలిసే నాయకుల సంఖ్య పెరుగుతుందని, దీంతో సంప్రదింపులకు అవకాశం ఉండదని భావించిన కేసీఆర్ ఢిల్లీలో మకాంవేసి ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు 60కిపైగా వివిధ కార్పొ రేషన్ల చైర్మన్ పదవులు - 150కిపైగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు - 250కిపైగా దేవాలయాల పాలక మండళ్ళ పదవులను నామినేట్ చేసిన సీఎం కేసీఆర్ ఇక పార్టీ రాష్ట్రస్థాయి పదవులను భర్తీచేసి నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై పూర్తిస్థాయి కార్యాచరణకు దిగాలని నిర్ణయించుకున్నారు. దాదాపు నాలుగు వేల మందికి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు లభించాయి. కొత్తగా కొన్ని పదవులను సైతం సృష్టించారు. 75వేల రూపాయల వేతనంతో జిల్లాకు ఒక ఉమెన్ ఆర్గనైజర్ ను కొత్తగా నియమించారు. అదే విధంగా తొలిసారిగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులకు 75 వేల గౌరవ వేతనం నిర్ణయించారు. రాష్టస్థ్రాయిలో దాదాపు 30 కార్పొరేషన్లలో ఇంకా నియామకాలు చేపట్టాలి. అదే విధంగా కొన్ని ఆలయాల పాలక వర్గాలను నియమించాలి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ పదవుల కోసం పలువురు నాయకుల పేర్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు.
సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు కూడా లేకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని నానినేటెడ్ పదవుల పంపకాన్ని ఇప్పటికైనా వెంటనే పూర్తి చేస్తే బాగుంటుందని కొందరు నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కసరత్తు ప్రారంభమైందని అంటున్నారు. గతంలో ఎమ్మెల్యేలు నామినేటెడ్ పదవుల కోసం నియోజక వర్గాల వారిగా ప్రతిపాదనలు పంపించారు. ముఖ్యమంత్రికి మరోసారి పేర్లు అందజేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీలో కసరత్తు చేస్తున్న కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక వరుసగా నామినేటెడ్ పదవుల పంపకం చేస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఒకవైపు కంటి ఆపరేషన్ కోసం ఢిల్లీలో మకాం వేసిన ముఖ్యమంత్రి రెండు రోజుల నుంచి నామినేటెడ్ పదవులపై దృష్టిసారించడంతో నాయకులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో ఉన్నప్పటికీ కేసీఆర్ మామూలు కంటే ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/