Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫాంహౌస్ లో ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   17 April 2016 9:30 AM GMT
కేసీఆర్ ఫాంహౌస్ లో ఏం జరుగుతోంది?
X
తెలంగాణలో త్వరలోనే నామినేటేడ్ పదవుల భర్తీ చేయనున్నారు. టీఆరెస్ అధినేత - తెలంగాణ సీఎం కేసీఆర్ అందుకు తగిన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయి పదవులను ఎవరికి ఇవ్వాలనేది ఇప్పటికే నిర్ణయం అయిపోయిందని తెలుస్తోంది. తన వ్యవసాయ క్షేత్రం వేదికగా ఈ కసరంతా చేశారని... పార్టీ ముఖ్యులతో దీనిపై చర్చలు జరుపుతూ ప్రయారిటీస్ నిర్ణయించి తాను అనుకుంటున్న పేర్లపై తుది నిర్ణయం తీసుకునేందుకు అభిప్రాయాలు తెలుసుకుంటున్నారని సమాచారం. ముఖ్యంగా టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా పార్టీ అధినేత కేసీఆర్ పగ్గాలు చేపట్టిన తర్వా త ఫాంహౌస్ ఇలాంటి అంశాలకు వేదికగా మారింది. ప్రస్తుతం నామినేటేడ్ పదవులకు సైతం సీఎం ఫాం హౌసే వేదికగా మారుతోంది.

ఫాంహౌస్ లో జరుగుతున్న కసరత్తు సమాచారం టీఆరెస్ వర్గాల్లో బయటకు రావడంతో రెండేళ్లుగా పెండింగులో ఉన్న నామినేటేడ్ పదవుల భర్తీకి త్వర లోనే మోక్షం లభించే అవకాశముందని పార్టీ నేతలు ఆశపడుతున్నారు. ఈ నెల 27న జరగనున్న ప్లీనరీ సమావేశాలను పూర్తి చేసి ఆ తర్వాత నామినేటేడ్ పదవులను భర్తీ చేస్తారని అనుకుంటున్నారు. గత ఏడాది నుంచి వీటిని భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ భావించినప్పటికీ ఏదో ఒక అవాంతరం ఎదురవుతుండడంతో ఎప్పటికప్పుడూ ఈ పదవుల భర్తీని వాయిదా వేస్తూనే వున్నారు.

కాగా రాష్ట్ర స్థాయిలో దాదాపు 40 వరకు నామినేటేడ్ పదవులుండే అవకాశముంది. ఇందులో సుమారు 20 పోస్టులు కేబినెట్ హోదా కలిగి కలిగినవే కావడం విశేషం. వీటి భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ​