Begin typing your search above and press return to search.

ఫాంహౌస్ లో ఆ ప‌నిలో కేసీఆర్ ఫుల్ బిజీన‌ట‌!

By:  Tupaki Desk   |   27 Oct 2018 5:17 AM GMT
ఫాంహౌస్ లో ఆ ప‌నిలో కేసీఆర్ ఫుల్ బిజీన‌ట‌!
X
తెలంగాన ఆప‌ద్ద‌ర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు రోటీన్ కు భిన్నంగా ఉంటుంది. ఆయ‌న అంద‌రి లాంటి సీఎం అస్స‌లు కారు. కార‌ణ జ‌న్ముడు లాంటి కేసీఆర్ ఏం చేసినా అందులో ఏదో ఒక కొత్త‌ద‌నం క‌నిపిస్తుంటుంది. ఊరికి ముందు ముంద‌స్తుకు పోవ‌టం ఒక ఎత్తు అయితే.. అలా వెళ్లిన ఆయ‌న త‌న అభ్య‌ర్థుల‌ను ఎప్పుడో ప్ర‌క‌టించేశారు. మ‌రింత ఫాస్ట్ గా ఉన్న పెద్ద‌మ‌నిషి.. ప్ర‌చారంలో కూడా అంతే దూకుడు ప్ర‌ద‌ర్శించాలి క‌దా? కానీ.. ఎందుకో ఆ ప‌ని చేయ‌టం లేదు.

తొలుత వంద స్థానాల్లో ధూంధాంగా తిరిగి.. ఫుల్ గా ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు చ‌ప్పుడు చేయ‌ని ప‌రిస్థితి. ఆ మ‌ధ్య‌న పొద్దున‌.. మ‌ధ్యాహ్నం.. సాయంత్రం.. ఇలా మూడు పూట‌ల మూడు స‌భ‌లు కాకున్నా.. రెండు స‌భ‌లు పెట్టి త‌న‌లో ఎంత హుషారుందో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు విపక్షాల‌పై విరుచుకుప‌డ‌ట‌మే కాదు.. కేసీఆర్ తిట్టిన తిట్ల‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ప‌రిస్థితి.

ప్ర‌చారం స్టార్టింగే ఇంత‌లా ఉంటే.. కాలం గ‌డిచే కొద్దీ ప‌రిస్థితులు మ‌రెలా మార‌తాయి? అన్న సందేహం క‌లిగే ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. చ‌ప్పుడు చేయ‌కుండా.. చాలా విష‌యాల‌కు బ‌య‌ట‌కు రాకుండా కొడుకు చేత‌నే ప‌నులు పూర్తి చేయిస్తున్న కేసీఆర్‌.. ఆ ఫాంహౌస్ లో ఏం చేస్తున్న‌ట్లు? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. తాజాగా ఆ విష‌యానికి సంబంధించిన కాస్త క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

ఫాంహౌస్ లో సారు ఏం చేస్తార‌న్న ప్ర‌శ్న రోజురోజుకు పెరుగుతున్న వేళ‌.. సాబ్ చేసేది ఏమిటో తెలుసా? అన్న విష‌యాన్ని మ‌స్తు పాజిటివ్ గా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో రిజిష్ట‌ర్ చేసేలా ఒక ప్రెస్ నోట్ ను అన‌ధికారికంగా విడుద‌ల చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇందులో కేసీఆర్‌ ఫాంహౌస్ లో ఎంత బిజీ అన్న విష‌యాన్ని చెప్ప‌ట‌మేకాదు.. ఆయ‌న టీఆర్ ఎస్ గెలుపుకోసం స్వ‌యంగా పాట‌లు రాసుడు.. పాటల ర‌చ‌యిత‌ల‌తో క‌లిసి చ‌ర్చ‌ల మీద చ‌ర్చ‌లు జ‌రిపి.. యావ‌త్ తెలంగాణ స‌మాజం త‌న పాట‌ల‌తో క‌దిలిపోయేలా.. వెనుకా ముందు చూసుకోకుండా కారు గుర్తు మీద ఓట్ల‌ను గుద్దేలా మ‌న‌సును మార్చేసే పాట‌ల్ని రాసిన‌ట్లుగా చెబుతున్నారు.

రాబోయే రోజుల్లో ప్ర‌చారం మ‌స్తు హుషారుగా మారిపోయేనేప‌థ్యంలో.. అప్ప‌టికి స‌రిపోయే రీతిలో ప‌ది నుంచి ప‌న్నెండు పాట‌ల్ని ఫైన‌ల్ చేశార‌ట‌. దానికి సంబంధించి రికార్డింగు.. త‌ద‌నంత‌ర ప‌నుల మీద మ‌స్తు ప‌నిలో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ పాట‌లు ప్ర‌జ‌ల్ని క‌ద‌లించ‌ట‌మేకాదు.. కేసీఆర్ నాలుగున్న‌రేళ్ల పాటు ఎంత‌గా పొడిచింది.. తెలంగాణ‌ను బంగారు తెలంగాణగా మార్చే ప్ర‌యాణం ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చిన వైనాన్ని చెబుతార‌ట‌. అంతా బాగుంది కానీ సారూ.. నాలుగున్న‌రేళ్ల‌లో క‌నీసం ప‌ది సార్లు కూడా స‌చివాల‌యానికి ఎందుకు రాని విష‌యం మీదా.. వంద‌ల కోట్లు ఖ‌ర్చుపెట్టిన నిర్మించుకున్న ప్ర‌గ‌తి భ‌వ‌న్ మీద‌న క్లారిటీ ఇస్తూ ఒక పాట రాస్తే.. జ‌నం సంతోషిస్తారేమో ఆలోచించండి.