Begin typing your search above and press return to search.

`కేసీఆర్ యువ‌సేన‌`స్థాపించిన కేతిరెడ్డి!

By:  Tupaki Desk   |   9 April 2018 1:51 PM GMT
`కేసీఆర్ యువ‌సేన‌`స్థాపించిన కేతిరెడ్డి!
X
ప్ర‌స్తుతం ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న రాష్ట్రంలోని పార్టీల‌న్నీ త‌మ నిర‌స‌న గ‌ళం వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఓ ప‌క్క వైసీపీ ఎంపీలు అనారోగ్యాన్ని కూడా లెక్క చేయ‌కుండా ఢిల్లీలో దీక్ష‌లు చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం ఆశించిన స్థాయిలో జరగడం లేదని తమిళనాడు తెలుగు యువనేత అధ్యక్షుడు, నిర్మాత‌ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమానికి కేసీఆర్ లాంటి నాయకుడు అవసరం అని,అపుడే ఉద్య‌మం ఉవ్వెత్తున లెగుస్తుంద‌ని కేతిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో జరిగిన కేసీఆర్ యువసేన సమావేశంలో పాల్గొన్న ఆయన అనేకా |షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ను కేతిరెడ్డి ఆకాశానికెత్తేశారు. త‌మ అందరికి మార్గ దర్శకుడు, భారత దేశంలో గుణాత్మకమైన మార్పు కోసం ప్ర‌య‌త్నిస్తోన్న కేసీఆర్ కు తాము మ‌ద్ద‌తిస్తున్నామ‌ని కేతిరెడ్డి అన్నారు. కేసీఆర్ కు మద్దతుగా త‌మిళ‌నాడులో 'కేసీఆర్ యువసేన' స్థాపించాన‌ని కేతిరెడ్డి అన్నారు. దేశ ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ - బీజేపీ లు మోసం చేస్తున్నాయని, పెడ‌ర‌ల్ ఫ్రంట్ స్థాప‌న‌కు కృషి చేస్తోన్న కేసీఆర్ విజ‌యం సాధిస్తార‌ని కేతిరెడ్డి ఆశాభావం వ్య‌క్తం చేశారు. అయితే, ఇప్ప‌టివర‌కు ఏపీ - తెలంగాణ రాజ‌కీయాల‌పై స్పందించ‌ని కేతిరెడ్డి ఒక్క‌సారిగా కేసీఆర్ జ‌పం చేయ‌డం ఆశ్చ‌ర్య‌కరం. ఒక‌వేళ భ‌విష్య‌త్తులో టీఆర్ ఎస్ లో చేరే ఉద్దేశ్యంతోనే కేతిరెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కొద్ది రోజుల క్రితం `లక్ష్మీస్ వీర‌గ్రంథం` పేరుతో ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కించేందుకు కేతిరెడ్డి స‌న్నాహాలు మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే.