Begin typing your search above and press return to search.

క‌ర్నూలులో కేఈ కుంప‌టి.. టీడీపీకి క‌ష్ట‌మే బ్రో!

By:  Tupaki Desk   |   12 Dec 2022 12:30 AM GMT
క‌ర్నూలులో కేఈ కుంప‌టి.. టీడీపీకి క‌ష్ట‌మే బ్రో!
X
బాబు ఒక అడుగు ముందుకు వేస్తే.. టీడీపీ త‌మ్ముళ్లు నాలుగు అడుగులు వెన‌క్కి లాగుతున్నారు. కొన్ని కొన్ని జిల్లాల్లో ఇదీ ప‌రిస్థితి! అన్న‌ట్టుగా ఉంది. ముఖ్యంగా కంచుకోట వంటి క‌ర్నూలు జిల్లాలో పార్టీనేత‌లు కొంద‌రు దూకుడు చూపిస్తున్న తీరు.. ఇబ్బంది పెడుతోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌మ‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని, త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. కేఈ కుటుంబం ఇప్పుడు అల‌క వ‌హించ‌డ‌మే కాదు.. పార్టీపై విమ‌ర్శ‌లు కూడా చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్‌ నాయకులు ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు మీద మండిపడుతున్నారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు జిల్లా టీడీపీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అనేక సంవత్సరాలుగా డోన్ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న తమ కుటుంబాన్ని చంద్రబాబు కరివేపాకులా తీసేసారని కేఈ ఇటీవ‌ల వ్యాఖ్యానించారు.

చంద్రబాబు తమను సంప్రదించకుండా.. ఎలాంటి సమాచారం లేకుండా డోన్ ఇన్‌ఛార్జి బాధ్యతలు ధర్మవరం సుబ్బారెడ్డికి అప్పగించడంపై ఆయ‌న మండిప‌డుతున్నారు. ఇటీవ‌ల మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పుట్టిన రోజున తెలుగు తమ్ముళ్లు సెలబ్రేషన్స్ చేశారు. ఇదే అవకాశంగా భావించిన కేఈ ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు.

అయితే, ఇక్క‌డ చంద్ర‌బాబు త‌ప్పు లేదు. ఎందుకంటే గ‌త ఎన్నిక‌లు ఎలాగో అయిపోయాయి. అప్పుడు చేసిన, జ‌రిగిన త‌ప్పులు ఇప్పుడుచేయ‌న‌ని ఆయ‌న పార్టీ నేత‌ల‌కు చెబుతున్నారు. ఈక్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ కుటుంబానికి ఒక టికెట్ మాత్ర‌మే ఇస్తాన‌ని తెగేసిచెబుతున్నారు. ఎందుకంటే.. ఒకే కుటుం బానికి రెండు టికెట్లు ఇస్తుంటే.. అసంతృప్తులు పెర‌గ‌డంతోపాటు.. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆ కుటుం బం స‌రిగా ఖ‌ర్చు చేయ‌లేక పోతోంది.

దీంతో ఒకే ఒక్క టికెట్‌ను ఇస్తే.. ఆర్థికంగా కూడా ఆ కుటుంబం ఖ‌ర్చు చేయ‌గ‌లుగుతుంద‌ని చంద్ర‌బాబులెక్క‌లు వేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌త్తికొండ‌ను కేఈ కృష్ణ‌మూర్తి కుమారుడికి అప్ప‌గించి..డోన్‌ను మాత్రం ధ‌ర్మ‌వ‌రం సుబ్బారెడ్డికి ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

దీనికి కూడా ఒక రీజ‌న్ ఉంది. వైసీపీ నేత‌, ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు సుబ్బారెడ్డి స‌రిపోతార‌ని ఆయ‌న అంచ‌నా వేసుకున్నారు. అయితే.. దీనిపైనేకేఈ ప్ర‌భాక‌ర్‌.. మండిప‌డుతున్నారు. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.