Begin typing your search above and press return to search.
తమ్ముడి ఎపిసోడ్ పై కేఈ మాటలు విన్నారా?
By: Tupaki Desk | 3 Jun 2016 2:27 PM GMTమంత్రి టీజీ వెంకటేశ్ కు రాజ్యసభ సీటు కేటాయించడాన్ని నిరసిస్తూ కర్నూలులో పార్టీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. సాక్షాత్తు పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగడం, అందులోనూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును టార్గెట్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఇదే సమయంలో ఈ వ్యవహారంపై కేఈ కృష్ణమూర్తి స్పందించారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సొంత తమ్ముడైనా - కుమారుడైనా ఉపేక్షించేది లేదని కేఈ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని...దాన్ని అందరూ గౌరవించాలని చెప్పారు. పార్టీ నేతలకు సరైన సమయంలో న్యాయం చేసేందుకు అధిష్టానం తప్పకుండా తగు చర్యలు చేపడుతుందని చెప్పారు. పదవులు కావాలంటే సమయం వచ్చేవరకు వేచి ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా కేఈ ప్రభాకర్ ను సస్పెండ్ చేసే యోచనలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణను కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.