Begin typing your search above and press return to search.
కేఈ కృష్ణమూర్తికి ‘సన్’ స్ట్రోక్
By: Tupaki Desk | 22 May 2017 6:14 AM GMTపేరుకు ఆయనది పెద్ద పదవి. రాజకీయాల్లో, తెలుగుదేశం పార్టీలో అపారమైన అనుభవం. అయినా, కాలం మాత్రం కలిసి రావడం లేదు. నిత్యం కష్టాలే. పదవికి తగ్గ గౌరవం, పలుకుబడి ఏమీ లేవు. పార్టీలోనూ ప్రయారిటీ లేదు. అధినేత చంద్రబాబుకు ఆయనంటే ప్రత్యేకమైన మక్కువేమీ లేదు. అయినా, ఏదో రకంగా సర్దుకుని నెట్టుకొస్తున్న ఆ పెద్ద మనిషికి తాజాగా మరో కష్టం వచ్చింది. అది కూడా కొడుకు రూపంలో దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది. ఇంతకీ.... ఇదంతా ఎవరి గురించో తెలుసా...? ఇంకెవరు? ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గురించి.
కేఈ పేరుకు డిప్యూటీ సీఎం అయినా చంద్రబాబు ఆయన్ను కరివేపాకులా పక్కకు తీసి పడేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయనకు కొత్త కష్టం వచ్చింది. వైసీపీ నేత హత్య కేసులో కేఈ కుమారుడి హస్తముందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబే వైసీపీ నేత నారాయణ రెడ్డిని హత్యం చేయించాడన్న వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు శ్యామ్ బాబుపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
ఇసుక దందాల విషయంలో కక్షతోనే నారాయణరెడ్డిని శ్యాంబాబు చంపించాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలే కర్నూలు రాజకీయాల తలనొప్పితో సతమతమవుతున్న వేళ కేఈ ఫ్యామిలీ ఇలాంటి గొడవ తేవడంతో చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని టాక్. కేఈ వల్ల ఏమాత్రం ప్రయోజనం లేకపోగా ఇలాంటి హత్యా రాజకీయాల వల్ల మరింత డ్యామేజి జరుగుతోందని.. పార్టీకి ఇది నష్టమని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ ఇష్యూ లోకల్ గా కేఈ ఫ్యామిలీకి ఎంతవరకు పట్టు సాధించిపెడుతుందో తెలియదు కానీ పార్టీలో మాత్రం తీవ్ర కష్టాల పాల్జేసేలా ఉంది.