Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌పై టీడీపీ ముప్పేట దాడి

By:  Tupaki Desk   |   29 Aug 2016 7:40 AM GMT
ప‌వ‌న్‌పై టీడీపీ ముప్పేట దాడి
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ తిరుప‌తిలో స‌భ‌లో ప్ర‌త్యేక హోదా అంశాన్ని ప్ర‌ధానాస్త్రంగా చేసుకుని అన్ని పార్టీల‌ను తూర్పార‌బ‌ట్టారు. మోడీకి హెచ్చ‌రిక‌లు జారీ చేసిన ప‌వ‌న్ కేంద్ర ప్ర‌భుత్వంపై కూడా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఇక ఏపీ సీఎం చంద్ర‌బాబు బాగానే క‌ష్ట‌ప‌డుతున్నార‌న్నా ప్ర‌త్యేక హోదా విష‌యంలో మరింత పోరాటం చేయాల‌ని సూచించారు. ఇక ఏపీ టీడీపీ ఎంపీల‌ను మాత్రం ప‌వ‌న్ ఓ రేంజ్‌ లో ఆడేసుకున్నారు.

టీడీపీ ఎంపీలు పార్ల‌మెంటులో ప్ర‌త్యేక హోదా కోసం బిచ్చ‌మెత్తుకుంటున్న‌ట్టు మాట్లాడ‌డంస‌రికాద‌ని కూడా ధ్వ‌జ‌మెత్తారు. ప‌వ‌న్ త‌మ‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంతో టీడీపీ ఎంపీలు ఒక్కొక్క‌రుగా ప‌వ‌న్‌ పై విరుచుకుప‌డుతున్నారు. ఆదివారం అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌ రెడ్డి మాట్లాడుతూ ప‌వ‌న్‌ కు వ‌య‌స్సు-అనుభ‌వం రెండూ త‌క్కువే అని..ఆయ‌న చంద్ర‌బాబును అన‌డం స‌రికాద‌ని అన్నారు. అలాగే త‌న‌కు ఎంపీ ప‌ద‌వి వెంట్రుక ముక్క‌తో స‌మాన్న‌మ‌న్న జేసీ ప‌వ‌న్ ప్ర‌త్యేక హోదా తెస్తానంటే తాను ఎంపీ ప‌ద‌వి వ‌దిలేసి ఆయ‌న వెంటే న‌డుస్తాన‌న్న సంగ‌తి తెలిసిందే.

ఇక అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా ప‌వ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. ప‌వ‌న్‌ కు తిక్క ఉంటే త‌న‌కు పిచ్చి ఉంద‌ని ఎద్దేవా చేశారు. త‌మ‌ను ప‌వ‌న్ ప్ర‌ధాని వ‌ద్ద బిచ్చ‌మెత్తుకుంటున్నామ‌ని అన‌డం స‌రికాద‌ని... ప్ర‌ధానిని సార్ అన‌కుండా ఏమ‌నాల‌ని ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఎదుటి వారికి నీతులు చెపుతున్న ప‌వ‌న్ తానుం ఏం చేశాడో ముందుగా చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఇక తాజాగా క‌ర్నూలు జిల్లాకు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ.వెంక‌టేష్ సైతం ప‌వ‌న్‌ ను టార్గెట్‌ గా చేసుకుని విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌త్యేక హోదా అంటూ ఇప్పుడు నిద్ర‌లేచిన ప‌వ‌న్ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుంభకర్ణుడిలా నిద్రపోయార‌ని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పుడు లేచి ప్ర‌త్యేక‌హోదా కోసం ఎంపీలు రాజీనామా చేయాల‌న‌డం ఆయ‌న‌ అవివేకానికి నిద‌ర్శ‌నమ‌ని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్ ఇదే వ్యాఖ్య‌లు త‌మిళ‌నాడులో చేస్తే సీఎం జ‌య‌ల‌లిత ఆయ‌న కాళ్లు - చేతులు విర‌గ్గొట్టించే వార‌ని టీజీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇక సోమ‌వారం తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణ‌మూర్తి మాట్లాడుతూ ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై కాస్తంత భిన్నంగా స్పందించి త‌న విభిన్న‌త చాటుకున్నారు. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డంలో కేంద్రం సాకులు చెపుతోంద‌న్న ఆయ‌న... ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం స్టార్ట్ చేసిన ప‌వ‌న్‌ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.