Begin typing your search above and press return to search.
కేఈ మెడపై కత్తి వేలాడుతున్నట్టేనా?
By: Tupaki Desk | 6 Sep 2015 5:40 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా ముగిసింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కూడా అంతకు రెండు రోజుల ముందే ముగిసాయి. రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్లో చాలా మంది ఆశావహులు అత్యంత కీలకంగా ఎదురుచూస్తున్న ఒక పర్వం మాత్రం మిగిలే ఉంది. అదే కేబినెట్ విస్తరణ. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గాన్ని విస్తరించాలనే వ్యవహారం చాలా కాలం నుంచి పెండింగ్ లోనే ఉన్నది. సంఖ్యాపరంగా ఇంకా సుమారు 8 మందికి మంత్రి బెర్తులు ఇచ్చే అవకాశం ఉండగా.. ఏడాది పాలన గడచిపోయినా.. ఇప్పటిదాకా ఖాలీలనే కొనసాగిస్తూ.. చంద్రబాబునాయుడు నాయకులందరినీ ఊరిస్తూ రోజులు నెట్టుకొస్తున్నారు. అయితే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దగ్గర పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇదివరలో అసెంబ్లీ సమావేశాల తర్వాత విస్తరణ ఉంటుందని వార్తలొచ్చాయి. ఇప్పుడు విజయదశమి లోగా.. పదవుల పందేరం ఉంటుదని అనుకుంటున్నారు.
విస్తరణలో అనేక రకాల కాంబినేషన్ల గురించి చర్చోపచర్చలు జరుగుతూ ఉండగా ప్రస్తుతం ఉన్న వారిలో డిప్యూటీ ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి పరిధి నుంచి రెవెన్యూ శాఖను తప్పించవచ్చునని ఒక ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తోంది. కెఇ కృష్ణమూర్తి కేబినెట్ లోని వారిలో సీనియర్లలో ఒకరు. పైగా చంద్రబాబుకు అంత సులువుగా కొరుకుడు పడని వ్యక్తి. చంద్రబాబు వైఖరి నచ్చకపోతే.. నిర్మొగమాటంగా చెప్పేసే నేతగా పేరుంది. ఆయన మీద చంద్రబాబు చాలా అసంతృప్తితో రగిలిపోతున్నారని చాలా రోజులుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతూనే ఉంది.
అయితే తాజాగా చంద్రబాబు మాటలు అందిస్తున్న సంకేతాలు కూడా అలాగే ఉన్నాయి. పనితీరు బాగాలేదంటూ చంద్రబాబు నాలుగు శాఖల గురించి అసంతృప్తి వ్యక్తం చేయగా.. వాటిలో అగ్రభాగాన ఉన్నది రెవెన్యూ శాఖే. చాలాకాలంగా కేఈ కృష్ణమూర్తి పై ఉన్న ఇతర అన్ని రకాల అసంతృప్తులను కూడా కలుపుకుని.. ఈ సారి జరగబోయే విస్తరణలో ఆయన మీద వేటు పడుతుందని ఊహాగానాలు ముమ్మరంగా వినిపిస్తున్నాయి. కేఈ కృష్ణమూర్తిని రెవెన్యూ నుంచి తప్పించడం ఖరారు అని అంతా అంటున్నారు. ఆయనకు డిప్యూటీ హోదాను అలాగే ఉంచి, బహుశా దేవాదాయ శాఖను అప్పగిస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి. చంద్రబాబుకు మరికొందరు మంత్రులపై కూడా అసంతృప్తి ఉన్నది. కేబినెట్ విస్తరణ అంటూ జరిగితే కుదుపులు భారీగానే ఉంటాయని చాలా మంది అంచనా వేస్తున్నారు. కాకపోతే.. కేఈ మీద చర్య గ్యారంటీ అన్నది ఇప్పుడు సెక్రటేరియేట్ పరిధిలో ఒక బహిరంగ రహస్యం అయిపోయింది. ఆయన మెడ మీద కత్తి వేలాడుతూ ఉన్నదని.. శాఖ మారుస్తారా? ఏకంగా కేబినెట్ నుంచే తప్పిస్తారా? అనేది మాత్రమే ఎదురుచూసి తెలుసుకోవాల్సి ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.