Begin typing your search above and press return to search.
బాబుకు దెబ్బేసేలా కేఈ కమిట్ అయ్యాడుగా!
By: Tupaki Desk | 26 July 2018 6:15 AM GMTమాటల్ని తిప్పటంతో తెలుగుదేశం పార్టీ తర్వాతే ఎవరైనా. ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రతిపక్ష పార్టీ తీవ్రంగా పోరాడుతుంటే.. అందుకు సహకరించాల్సింది పోయి.. విపక్ష నేత మీద ఉన్న ఆగ్రహాన్ని ప్రత్యేక హోదా మీద చూపించి ఏపీ ప్రజలకు తీరని ద్రోహం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.
తొలి నుంచి హోదా నుంచి పక్కకు జరగొద్దంటూ ఎంత చెప్పినా వినని చంద్రబాబుకు.. ఎన్నికలు దగ్గరకు వచ్చాక కానీ తాను చేసిన తప్పు ఎంత తీవ్రమైనదన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు. దీంతో.. తన తప్పును కప్పి పుచ్చుకోవటానికి.. ప్రజల్ని మాయ చేయటానికి వీలుగా తనకు బాగా అలవాటైన యూటర్న్ తీసుకున్న ఆయన.. హోదా మీద కొత్త గళాన్ని వినిపించటం షురూ చేశారు.
హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అంటూ కేంద్రంతో బేరం కుదర్చుకున్న ఆయన.. ఏపీ ప్రజాగ్రహంతో వెనక్కి తగ్గి ఇప్పుడు హోదానే ముద్దంటున్నారు. ఈ విషయంపై చేసిన తప్పును ఒప్పుకొని.. తాను తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందన్న విషయంపై వివరణ ఇస్తే సరిపోయేది.
కానీ.. తప్పును ఒప్పుకునే కన్నా.. దాన్ని కవర్ చేయటం మరింత సమస్యగా మారింది. ఇదిలా ఉంటే.. హోదా విషయంలో తాము వేసిన తప్పటడుగును చెప్పేశారు ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి.తాజాగా మాట్లాడిన ఆయన అధినేత యూటర్న్ వెనుక ఉన్న విషయాన్ని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.
హోదాకు మించి ఇస్తామంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నామని ఆయన వెల్లడించారు. అయితే.. ప్యాకేజీ కింద నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తుందనే హోదా అడుగుతున్నట్లుగా చెప్పారు. కేఈ మాటలు వింటే రెండు డౌట్లు రాక మానదు. అంటే.. రేపొద్దున హోదాకు మించి ప్యాకేజీ అమలు చేస్తామని ఎవరైనా చెబితే.. మళ్లీ యూటర్న్ తీసుకుంటారా? అన్నది ఒక ప్రశ్న అయితే.. అమరావతి శంకుస్థాపనకు ఒక బిందెడు మట్టి.. మరో బిందెడు నీళ్లు తెచ్చిన పెద్ద మనిషి.. హోదాకు మించిన ప్రయోజనాన్ని ఇస్తామని చెబితే.. బుర్ర ఉన్న ఎవరైనా నమ్ముతారా..? ఆ మాత్రం తెలివి బాబు అండ్ కోకు లేదా?