Begin typing your search above and press return to search.
కేఈ.. బాబు కలల్ని కల్లలు చేస్తావేంది?
By: Tupaki Desk | 6 Jun 2018 9:28 AM GMTఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని కీలక అంశాలపై ఆచితూచి స్పందించాల్సి ఉన్నప్పటికీ.. కేఈ తనదైన ధోరణిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ అధికారపక్షంలో హాట్ టాపిక్ గా మారాయి. తన వ్యాఖ్యలతో తరచూ చంద్రబాబును ఇరుకున పడేయటంలో కేఈ దిట్టగా చెబుతుంటారు.
పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ కీలకంగా ఉన్నప్పటికీ బాబు మీద గుర్రుతో కేఈ అప్పుడప్పుడు అధినేతను గిల్లేలా మాట్లాడుతుంటారన్న పేరుంది.
2019 సార్వత్రిక.. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదోలా అధికారాన్ని చేజిక్కించుకోవటానికి భారీ ప్లాన్స్ వేస్తున్నారు చంద్రబాబు. టీడీపీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి మంచి పట్టు ఉన్న నేతలు కొందరు.. బాబు ఈసారి కాంగ్రెస్ తో చేతులు కలిపే అవకాశం ఉందన్న మాటను చెబుతున్నారు. ఎన్నికలకు మరో ఏడాది టైం ఉండటం.. అప్పటి పరిస్థితులు.. పరిణామాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయన్న మాట బలంగా వినిపిస్తోంది.
బీజేపీ.. జనసేనలకు దూరమైన బాబు తన ఓటు బ్యాంక్ ను పెంచుకోవటం కోసం కాంగ్రెస్ మినహా మరో పార్టీతో జత కట్టే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సంచలన నిర్ణయాన్ని తీసుకునే వీలుందన్న అభిప్రాయాన్ని టీడీపీ నేతలు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వేళ.. బాబు కలల్నికల్లలు చేస్తూ కేఈ తీవ్రస్థాయిలో ఈ అంశంపై రియాక్ట్ కావటం ఇప్పుడు సంచలనంగా మారింది.
కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని.. ఒకవేళ అదే జరిగితే తాను ఉరి వేసుకోవటానికైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. ఇది తన వ్యక్తిగతం కాదని.. పార్టీ తరపునే చెబుతున్నట్లుగా చెప్పారు. పార్టీకి సంబంధించిన కీలక అంశంపై బాబు స్పందించాల్సింది పోయి.. కేఈ స్పందించటం బాబుకు ఇబ్బందికి గురి చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే.. కర్నూలు జిల్లా ప్రజల ఆదరణతోనే తాను రాజకీయంగా ఎదిగానన్న కేఈ.. ధైర్యం ఉంటే తన కుటుంబంతో పోటీ చేసి గెలవాలని.. వ్యక్తిగత దూషణలకు దిగటం సరికాదన్న వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో బీసీలపై తమ కుటుంబ పెత్తనం ఏమీ లేదన్నారు.