Begin typing your search above and press return to search.
కేఈ విమర్శలో సీనియారిటీ కనిపించింది..
By: Tupaki Desk | 9 Feb 2018 1:38 PM GMTఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చాలాకాలంగా చురుగ్గా లేరన్న మాట వినిపిస్తోంది. సీనియర్ నేత అయిన ఆయనకు స్థాయికి తగ్గ పదవి ఇచ్చినా ప్రాధాన్యం మాత్రం ఇవ్వడం లేదన్న మాట టీడీపీలో ఉంది. ఆ అసంతృప్తితోనే ఆయన ఎందులోనూ జోక్యం చేసుకోవడం లేదన్నది టాక్. అయితే.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేఈ వంటివారు కీలక అంశాలపై మాట్లాడితే ఎలా ఉంటుందో ఆయన తన తాజా వ్యాఖ్యలతో రుజువు చేశారు. కేంద్రం తీరు, మోదీ ప్రసంగంపై టీడీపీ నేతలంతా చేసిన విమర్శలన్నీ ఒకెత్తయితే... కేఈ ఒక్క మాటలో వేసిన కౌంటర్ ఒకెత్తు. పార్లమెంటులో కాంగ్రెస్ తలుపులు మూసి ఏపీని విభజించిందని మోదీ అన్న మాటలకు స్పందించిన కేఈ... ‘పార్లమెంటులో కాంగ్రెస్ తలుపులు మూసి అన్యాయం చేస్తే.. బీజేపీ వాళ్లు తలుపులు తెరిచే అన్యాయం చేస్తున్నారు’’ అంటూ కేఈ కృష్ణమూర్తి అన్నారు.
తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే వేమారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి తమ ఎంపీలు నిరసన తెలుపుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసిన గల్లా జయదేవ్ ను ఆయన అభినందించారు.
కేంద్రం ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని... లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేఈ హెచ్చరించారు. కాగా... తాజా పరిణామల నేపథ్యంలో బీజేపీతో పొత్తు తెంచుకుంటే మంచిదని కూడా కేఈ భావిస్తున్నారని.. త్వరలో ఆయన చంద్రబాబుకు ఈ విషయం చెప్పనున్నారని సమాచారం. అయితే.. ఒకరి మాట వినే రకం కాని చంద్రబాబు కేఈ మాటను ఎంతవరకు చెవికెక్కించుకుంటారన్నది అనుమానమే.