Begin typing your search above and press return to search.

కేఈ ప్ర‌భాక‌ర్..అటూ ఇటూ కాకుండా అయ్యారా!

By:  Tupaki Desk   |   18 March 2020 4:30 PM GMT
కేఈ ప్ర‌భాక‌ర్..అటూ ఇటూ కాకుండా అయ్యారా!
X
కేఈ ప్ర‌భాక‌ర్ తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా ప‌ని చేసిన నేత‌. ఆ పార్టీ త‌ర‌ఫున మాజీ మంత్రి కూడా. ఆయ‌న సోద‌రుడు కేఈ కృష్ణ‌మూర్తి గ‌త ఐదేళ్లూ డిప్యూటీ సీఎంగా కూడా ప‌ని చేశారు. తెలుగుదేశం పార్టీకి వీర భ‌క్తుల్లా క‌నిపించారు ఈ అన్న‌ద‌మ్ములు. అయితే ఇప్పుడు టీడీపీ యాక్టివిటీస్ కు వీరు దూరం అయ్యారు. స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున పోర‌డ‌టానికి కేఈ కృష్ణ‌మూర్తి ముందుకు రాలేదు. డోన్ ప‌రిధిలో పోటీనే ఉండ‌ద‌ని ఆయ‌న తేల్చేశారు.

ఇక కేఈ ప్ర‌భాక‌ర్ అయితే.. టీడీపీకి రాజీనామానే చేసేశారు. వారం రోజుల కింద‌టే ఆయ‌న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న మ‌రో పార్టీ కండువా ఏదీ వేసుకోలేదు. ఒక‌వైపు కేఈ ప్ర‌భాక‌ర్ ను బుజ్జ‌గించ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ ఉంద‌ట తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ఇప్ప‌టికే రాజీనామా అంటూ ప్ర‌క‌టించినా...ఆయ‌నకు స‌ర్దిచెప్ప‌డానికి టీడీపీ హై క‌మాండ్ ప్ర‌య‌త్నాలు సాగిస్తూ ఉంద‌ట‌. వ‌ర‌స‌గా నేత‌ల రాజీనామాల‌తో తెలుగుదేశం పార్టీ కొంత‌మందిని అయినా బుజ్జ‌గించో, బ‌తిమాలో నిల‌బెట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న‌ట్టుగా ఉంది.

అయితే ఇప్పుడు మ‌ళ్లీ టీడీపీలో యాక్టివేట్ అయితే కేఈ ప్ర‌భాక‌ర్ ప‌రువు పోయే అవ‌కాశం ఉంది. అలాగ‌ని ఆయ‌న ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోలేదు. వైసీపీ ఇప్పుడు ఎలాగూ రార‌మ్మంటూ కండువాలు వేసే ప‌రిస్థితి ఉండ‌దు. వ‌చ్చిన వారికి వేస్తూ ఉండ‌వ‌చ్చు. బ‌తిమాల‌క‌పోవ‌చ్చు. ఇలాంటి నేప‌థ్యంలో కేఈ ప్ర‌భాక‌ర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ష‌ర‌తు పెట్టి ఉండ‌టం వ‌ల్ల ఆయ‌న చేరిక లేట్ అవుతుండ‌వ‌చ్చ‌నే అభిప్రాయాలూ వినిపిస్తూ ఉన్నాయి.

మొత్తానికి అటు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, ఇటు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోక‌.. ప్ర‌స్తుతానికి కేఈ ప్ర‌భాక‌ర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న‌ట్టున్నార‌నే అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు ప‌రిశీల‌కులు.