Begin typing your search above and press return to search.

జైలుకు వెళ్లే ముందు పోలీసులకు కీర్తి షాక్

By:  Tupaki Desk   |   2 Nov 2019 4:51 AM GMT
జైలుకు వెళ్లే ముందు పోలీసులకు కీర్తి షాక్
X
ఒక ప్రియుడితో ప్రేమ.. అంతలోనే గర్భం. దాన్ని విచ్చితి చేసుకునే క్రమంలో మరో రిలేషన్.. ఇలాంటివి తప్పన్న కన్నతల్లిని కర్కశంగా హతమార్చిన కీర్తి ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా జైలుకు పంపే వేళ.. ఆమె చెప్పిన కొన్ని మాటలు.. చేష్టలు పోలీసులకు షాకింగ్ గా మారాయని చెబుతున్నారు.

హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునగనూరుకు చెందిన కీర్తి తన పదహారేళ్ల వయసులోనే మొదటి ప్రియుడు బాల్ రెడ్డికి దగ్గరైనట్లుగా తెలుస్తోంది. తరచూ అతని ఇంటికి వెళ్లే ఆమె.. గర్భం దాల్చటం.. దాన్ని విచ్చిన్నం చేసుకోవటం కోసం మహబూబ్ నగర్ వెళ్లటం తెలిసిందే. ఆ సందర్భంగా ఆమె అన్నయ్య అని పిలిచే శశికుమార్ బ్లాక్ మొయిలింగ్ కు తలొగ్గి అతనికి శారీరకంగా దగ్గరైనట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తల్లిని హతమార్చిన కేసులో జైలుపాలైన ఆమె.. తాను ఎప్పటికైనా బాల్ రెడ్డిని పెళ్లాడతానని చెప్పిన వైనం పోలీసులకు ఆశ్చర్యానికి గురి చేసినట్లు తెలుస్తోంది. తల్లిని చంపిన దానికి పశ్చాతాపం కంటే కూడా ఆమె తీరు కొంత షాకింగ్ గా మారినట్లు చెబుతున్నారు.
తాజాగా కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లిన హయత్ నగర్ పోలీసులు ఆమె తీరును చూసి నోట మాట రానట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల కస్టడీ నుంచి జైలుకు వెళ్లే సమయంలో.. బై.. బై.. సర్.. మళ్లీ కలుస్తానని ఆమె మాట్లాడుతున్న తీరు చూస్తే.. ఆమెది అమాయకత్వమో.. విపరీతమైన నేర మనస్తత్వమా? అన్నది అర్థం కావట్లేదన్న మాట వినిపిస్తోంది. తన మాటలతో పోలీసులకు కీర్తి షాకుల మీద షాకులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.