Begin typing your search above and press return to search.
'కీర్తి సురేష్ 'బొమ్మతో రూ.40లక్షలకు బొక్క!
By: Tupaki Desk | 3 Dec 2022 2:38 PM GMTఫేస్‌బుక్‌లో హానీట్రాప్ మోసాలు విచ్చల విడిగా జరుగుతున్నాయి. నెటిజన్లు ఏమాత్రం అజాగ్రత్త పడినా మోసగాళ్లు జేబులకు కన్నమేసేస్తున్నారు. ఇలాగే సినిమా నటి కీర్తి సురేష్ డీపీ బొమ్మ చూపి ఒక కుర్రాడ్ని బోల్తా కొట్టించి అతడి నుంచీ 40 లక్షలు కొట్టేసిన మాయా లేడీ మోసం బయటకువచ్చి నెటిజన్లంతా నోరెళ్లబెట్టేలా చేసింది.
'మహానటి' సినిమాలో అలనాటి హీరోయిన్ సావిత్రి పాత్రలో నటించిన క్యూట్ హీరోయిన్' కీర్తి సురేష్' ఎవరికి తెలియదో చెప్పండి. అలాంటి కీర్తి సురేష్ స్వయంగా ఫేస్‌బుక్(Facebook)లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి చాటింగ్ చేయడం మొదలుపెడితే పరిస్థితి ఎలా ఉంటుంది. ఆ కుర్రాడి స్థితి కూడా అలాగే మారిపోయింది. ఫేస్‌బుక్ వాల్‌లో కీర్తి సురేష్ డీపీ బొమ్మ చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. చాటింగ్ మొదలుపెట్టాడు. చివరకు ఆ చాటింగ్ మత్తులో పడి ఏకంగా ఫోన్‌పే ద్వారా 40 లక్షల రూపాయలు చాటింగ్ చేసిన లేడీకి పంపేసి మోసపోయాడు. అంత నష్టపోతే కానీ ఆ కుర్రాడికి తాను చాటింగ్ చేస్తున్నది కీర్తి సురేష్‌తో కాదు ఒక కిలేడీతో అన్న విషయం స్పృహలోకి రాకపోవడమే ఈ సంఘటనలో విచిత్రం.
కర్నాటక రాష్ట్రం విజయ్‌పూర్ జిల్లా సిందగి తాలూకా బగలూరు గ్రామానికి చెందిన పరశురామ అనే యువకుడు హైదరాబాద్‌లో భవన నిర్మాణ కార్మికులకు సూపర్‌వైజర్ ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు రూ.30వేల జీతం. పరశురామకు ఫేస్‌బుక్‌లో హాసన్‌కు చెందిన మంజుల అనే ఇద్దరు పిల్లల తల్లితో పరిచయం ఏర్పడింది. కాకుంటే ఇక్కడే ఓ ట్విస్ట్. ఆమె తన అసలు పేరుతో కాకుండా నటి కీర్తి సురేష్ పేరిట నకిలీ ఫేసుబుక్ ఐడీ క్రియేట్ చేసి ఆమె పేరుతో పరిచయం చేసుకుంది. తన డీపీ పిక్చర్ స్థానంలో అందమైన కీర్తి సురేష్ ఫొటో పెట్టింది. అదే పేరుతో చాటింగ్ మొదలెట్టింది.
తనకు పరిచయమైన అమ్మాయి సినిమా హీరోయిన్ అని ఈ కుర్రాడు తెగ మురిసిపోయాడు. గాల్లో తేలిపోయాడు. ఈ ఫేస్‌బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ రోజూ గంటల తరబడి చాటింగ్‌లలో మునిగి తేలారు. ఈ క్రమంలో మంజుల (కీర్తి సురేష్ పేరుతో) తనకు చాలా ఆర్థిక కష్టాలున్నాయని, సెంట్రల్ గవర్నమెంటు జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను ఆర్థికంగా సాయం కావాలని అర్థించింది. ఆమె మాటలకు కరిగిపోయిన పరశురామ ఆమె చదువుల కోసం ఇంట్లో పొదుపు చేసిన 5 లక్షల నగదు, తన ప్లాట్‌తో సహ అమ్మేసి ఆమె చదువులకు డబ్బులు పంపించాడు. మొత్తం ఫోన్‌పే ద్వారా పంపాడు. తరువాత అతడు మనిద్దరం కలుద్దామని ఎన్నిసార్లు అడిగినా ఆమె ఇప్పడు కాదు అప్పుడు అంటూ రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంది.
అనుమానం వచ్చిన పరశురామ్ తన డబ్బులు ఇచ్చేయాలని ఆమెను అడిగారు. దాంతో మంజుల ఒక ప్లాన్ వేసింది. ఓ రోజు తన ఫేస్ కనబడకుండా జాగ్రత్త తీసుకుని పరశురామ్‌కు వీడియో కాల్ చేసింది. నువ్వు నాతో మాట్లాడుతూ స్నానం చెయ్యి అని పరశురామ్‌ను కోరింది. దాంతో మనోడు గంతులేస్తూ స్నానం చేశాడు. ఈ దృశ్యాలను ఆమె వీడియోకాల్‌లో రికార్డు చేసింది. తరువాత ఈ వీడియో పరశురామకు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది.
ఏం చేయాలో తెలీక తాను మోసపోయానని తెలుకున్న ఆ కుర్రాడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.