Begin typing your search above and press return to search.
కేజ్రీకి ఘాటు లేఖ రాసిన అన్నా హజారే
By: Tupaki Desk | 26 Dec 2016 8:00 AM GMTప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే తన శిష్యుడు-ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగితా పార్టీలకు ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద తేడా ఏముందని కేజ్రీవాల్ చర్యలపై ధ్వజమెత్తారు. ఆప్ అధికారిక వెబ్ సైట్లో నుంచి పార్టీకి విరాళం ఇచ్చిన వారి పేర్లను తొలగించడంపై కేజ్రీవాల్ ను హజారే ఎండగట్టారు. వారి పేర్లను ఎందుకు తొలగించాల్సి వచ్చిందని, మిగతా పార్టీలకు ఆప్ కు తేడా ఏముందని అన్నా హజారే సూటిగా ప్రశ్నించారు. మార్పు తీసుకొస్తానంటూ ఇచ్చిన ఏ ఒక్క హామీని కేజ్రీవాల్ నెరవేర్చలేకపోయారని అన్నారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖ రాశారు.
"ఆమ్ ఆద్మీ పార్టీకి విరాళం ఇచ్చిన వారి వివరాలను పార్టీ వెబ్ సైట్లో ఉంచుతానని హామీ ఇచ్చావు. కానీ 2016 జూన్ నుంచి వారి వివరాలను పార్టీ వెబ్ సైట్ నుంచి తొలగించారని నాకు లేఖ వచ్చింది. సమాజంలో మార్పు తీసుకొస్తానని నాకు హామీ ఇచ్చావు. కానీ, నువ్వు వాటిని నెరవేర్చలేదు. ఇందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను" అంటూ హజారే తన లేఖలో పేర్కొన్నారు.
ఇదిలాఉండగా ఇటీవల కేజ్రీవాల్ తరచూ వివాదాల్లో చిక్కుకోవడం సైతం అన్నాహజారేను బాధించిందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. 2013 నాటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో సొంత చిరునామా - ఆస్తుల మార్కెట్ విలువను తప్పుగా పేర్కొన్నారనే ఆరోపణలతో కేజ్రీవాల్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కేజ్రీవాల్ కు బెయిలు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే రూ.10 వేలు పూచీకత్తుగా కోర్టుకు కేజ్రీవాల్ సమర్పించాలని ఆశిష్ ఆదేశించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7కి ఈ కేసును వాయిదా వేశారు. ఇదే కేసులో కేజ్రీవాల్ వ్యక్తిగతంగా హాజరుకానక్కర్లేదని ఈ ఏడాది ఆగస్టు 31న కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై సైతం అన్నా హజారే అసంతృప్తితో ఉన్నారని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/