Begin typing your search above and press return to search.

మాజీ తీవ్ర‌వాది ఇంట్లో కేజ్రీ బ‌స‌..ర‌చ్చ ర‌చ్చ‌

By:  Tupaki Desk   |   31 Jan 2017 9:38 AM GMT
మాజీ తీవ్ర‌వాది ఇంట్లో కేజ్రీ బ‌స‌..ర‌చ్చ ర‌చ్చ‌
X
ఢిల్లీ సీఎం - ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మ‌రో వివాదంలో ప‌డ్డారు. ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా పంజాబ్ లోని మోగాలో మాజీ తీవ్రవాది ఇంట్లో బసచేయడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. పంజాబ్‌లోని జిగ్రాలో ప్రచారం చేశాక ఆయన మోగాలో శనివారం రాత్రి ఖలిస్థాన్ మాజీ తీవ్రవాది గురీందర్‌ సింగ్ ఇంటికి రహస్యంగా వెళ్లారు. ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. అధికారం కోసం కేజ్రీవాల్ ఎంతకైనా తెగిస్తారని ఈ ఘటన నిదర్శన మని శిరోమణి అకాలీదళ్ అధినేతసుఖ్ బీర్ సింగ్ బాదల్ విమర్శించారు. తీవ్రవాదులు, మితవాదులతో కుమ్మక్కైన పార్టీ ఆప్ అని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలువదన్న వార్తలు జర్నలిస్టులు డబ్బులు తీసుకుని రాసిన వాస్తవ విరుద్ధమైన వార్తలని కేజ్రీవాల్ ట్విటర్లో మండిపడ్డారు. ఇతర పార్టీలు డబ్బులిస్తే తీసుకుని తమ పార్టీకే ఓటు వేయాలని ఓటర్లకు పిలుపు ఇచ్చిన తనపై ఆగమేఘాల మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఈసీ.. ఇతర పార్టీల నేతలపై కూడా కేసు పెట్టాలని ఆయన కోరారు. కేంద్ర అరుణ్‌ జైట్లీ వేసిన పరువునష్టం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుమిత్ దాస్ ఆదేశించారు. మార్చి 25న జరిగే ఈ కేసు తదుపరి విచారణకు కేజ్రీవాల్‌తో సహా జైట్లీపై ఆరోపణలు చేసిన ఇతర ఆప్ నేతలు హాజరుకావాలన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/