Begin typing your search above and press return to search.
మోడీ ఇలాకాలో ఆప్ పాగా
By: Tupaki Desk | 8 July 2016 10:12 AM GMTవచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌పై అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆప్ ఆశలు పెంచుకుంది. ఈ మేరకు ఎన్నికల ప్రచారం సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో కేజ్రివాల్ తన పర్యటనను ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా మోడీతో విబేధించిన నాయకుడితో కలిసి కేజ్రివాల్ ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. ప్రజల్లో మంచి పట్టున్న బీజేపీ మాజీ నేత కను కల్సారియా ఇమేజ్ ను ఉపయోగించుకుని సౌరాష్ట్రలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.
ప్రధాని నరేంద్ర మోడీ - బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల స్వరాష్ట్రం కావడంతో గుజరాత్ పై కేజ్రీవాల్ ప్రత్యేక దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు ప్రచారం ప్రారంభించేందుకు శనివారం గుజరాత్ లో కేజ్రీవాల్ మూడు రైతు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. కల్సారియాతో కలిసిసాగుతూ ఆప్‌ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నారు. రైతు సమస్యలపై పార్టీతో విభేదిస్తూ బీజేపీని వీడిన కను కల్సారియా - కేజ్రీవాల్ ఫోటోలతో కూడిన పోస్టర్లు సౌరాష్ట్రలో దర్శనమిస్తున్నాయి. కేజ్రీవాల్ కు స్వాగతం పలుకుతూ ఆప్ శ్రేణులు ఈ పోస్టర్లను ఏర్పాటు చేశాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 182 స్థానాల్లో పోటీకి దిగుతున్నట్టు ఆ పార్టీ పేర్కొంది. సౌరాష్ట్రలో సుడిగాలి పర్యటన ద్వారా కేజ్రీవాల్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను కల్సారియా తప్పుపట్టారు. పచ్చని పొలాల్లో సిమెంట్ కంపెనీ ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకించారు. ప్రజలతో కలిసి ఆందోళనలు చేపట్టడంతో పార్టీ కల్సారియాను దూరం పెట్టింది. మహువాలో ఛారిటీ ఆసుపత్రిని నిర్వహించే కల్సారియా అటు తర్వాత మైనింగ్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు.
ఈ నిరసనకు కల్సారియాతో దాదాపు పదివేల మంది రైతులు కలిసివచ్చారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ 2014లో ఆ పార్టీని వీడిన కల్సారియా ఆప్‌లో చేరారు. అవినీతి సమర్ధంగా ఎదుర్కొనే సత్తా ఆప్‌కే ఉందని కల్సారియా చెబుతున్నారు. కల్సారియా నిజాయితీ, ప్రజల్లో ఆయనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని గుజరాత్‌లో పాగా వేయాలని ఆప్ ప్రయత్నిస్తోంది. పత్తి రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, విద్యుత్ సరఫరాలో లోటుపాట్ల వంటి అంశాల ఆధారంగా రైతుల్లో పట్టు పెంచుకోవాలని ఆప్ భావిస్తోంది.